AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: గంభీర్, అగార్కర్‌ల పెద్ద స్కెచ్.! ఇకపై రో-కో ‘బీ గ్రేడ్’ ప్లేయర్సా.?

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ఏ ప్లస్ నుంచి బీ కేటగిరీకి డిమోట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ ఏ ప్లస్ కేటగిరీని తొలగించాలని సూచించింది. ఆటగాళ్ల స్థాయి, ప్రదర్శన ఆధారంగా కాంట్రాక్టులు ఉండనున్నాయి.

Team India: గంభీర్, అగార్కర్‌ల పెద్ద స్కెచ్.! ఇకపై రో-కో 'బీ గ్రేడ్' ప్లేయర్సా.?
Team India
Ravi Kiran
|

Updated on: Jan 21, 2026 | 1:01 PM

Share

టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వార్షిక కాంట్రాక్టుల విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని టాక్. ప్రస్తుతం బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులలో అత్యున్నతమైన ఏ ప్లస్ కేటగిరీలో ఉన్న ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లను బీ కేటగిరీకి డిమోట్ చేయాలని బోర్డు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మార్పులకు ప్రధాన కారణం అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత పురుషుల సెలక్షన్ కమిటీ చేసిన సిఫార్సులు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ సిస్టమ్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని కమిటీ బోర్డుకు సూచించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, ప్రస్తుతం ఉన్న ఏ ప్లస్ కేటగిరీని పూర్తిగా తొలగించి, మూడు కేటగిరీలను మాత్రమే(ఏ, బీ, సీ) కొనసాగించాలని సెలక్షన్ కమిటీ ప్రతిపాదించింది. ఈ మార్పులు అమలైతే కోహ్లీ, రోహిత్ శర్మలపై తీవ్ర ప్రభావం పడనుంది.

ఇది చదవండి: ‘ఆ సాంగ్ వల్లే హీరోయిన్‌గా సినిమాలు మానేశా.!’

బీసీసీఐ ప్రతి సంవత్సరం ఆటగాళ్ల స్థాయి, వారి ప్రదర్శన, అలాగే వారు ఆడుతున్న ఫార్మాట్ల ఆధారంగా సెంట్రల్ కాంట్రాక్టులను ప్రకటిస్తుంది. ఏ ప్లస్ కేటగిరీలో ఉన్న ఆటగాళ్లకు 7 కోట్ల రూపాయలు, ఏ కేటగిరీ ప్లేయర్లకు 5 కోట్ల రూపాయలు, బీ కేటగిరీకి 3 కోట్లు, సీ కేటగిరీకి 1 కోటి రూపాయల వార్షిక వేతనాన్ని బీసీసీఐ చెల్లిస్తోంది. గత ఏడాది ఏప్రిల్‌లో 2024-25 సీజన్‌కు సంబంధించి బీసీసీఐ ప్రకటించిన వార్షిక కాంట్రాక్టులలో మొత్తం 34 మంది ఆటగాళ్లకు నాలుగు కేటగిరీల్లో చోటు దక్కింది. గతంలో బీసీసీఐ నిబంధనలను అతిక్రమించి కాంట్రాక్టులు కోల్పోయిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ తిరిగి కాంట్రాక్టులు అందుకోగా, తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డికి తొలిసారిగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఏడాది పొడవునా డబ్బే డబ్బు.! ఎవర్‌గ్రీన్ బిజినెస్‌లు.. ఇప్పుడు వీటికే డిమాండ్

నిబంధనల ప్రకారం, కాంట్రాక్టులు ప్రకటించిన సమయంలో జాబితాలో లేని ఆటగాడు ఎవరైనా ఆ తర్వాత ఒక సీజన్‌లో భారత జట్టు తరఫున మూడు టెస్ట్ మ్యాచ్‌లు, లేదా ఎనిమిది వన్డేలు, లేదా 10 టీ20లు ఆడితే, ఆ ప్లేయర్‌కు సెంట్రల్ కాంట్రాక్ట్‌లో సీ కేటగిరీలో చోటు కల్పిస్తారు. బోర్డు గతంలో హర్షిత్ రాణాకు ఇదే పద్ధతిలో కాంట్రాక్ట్ మంజూరు చేసింది. భారతదేశం తరఫున రెండు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 ఆడిన తర్వాత అతనికి సెంట్రల్ కాంట్రాక్ట్ లభించింది.

ఇది చదవండి: పరిటాల రవిని చంపిన మొద్దు శీను అవ్వాలనుకున్నది ఇదే.. కానీ చివరికి.!

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి