Temple bell: గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసా..?
Temple bell: దేవాలయాలలో గానీ, ఇంట్లో గానీ పూజా సమయంలో గంటలు మోగించడం సాధారణ విషయమే. స్కంద పురాణం, అగ్ని పురాణం, తంత్ర గ్రంథాలలో గంటల గురించి వివరించారు. గంట మోగించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని విశ్వాసం ఉంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సనాతన ధర్మంలో పూర్వకాలం నుంచి వస్తున్న అనేక సంప్రదాయాలను ఇప్పటికీ అనుచరిస్తుంటారు. అందులో ఒకటి పూజ సమయంలో శంఖంను పూరించడం, గంటను మ్రోగించడం. దేవాలయాలలో గంటలు ఉండటం అందరికీ తెలిసిన విషయమే. భక్తులు దేవతను ప్రార్థించేటప్పుడు దీనిని మోగిస్తారు. ఇంట్లో కూడా పూజా సమయంలో మనం చిన్న గంటను మోగిస్తాము. స్కంద పురాణం, అగ్ని పురాణం, తంత్ర గ్రంథాలలో గంటల గురించి వివరించబడింది. శంఖం లేదా గంటను మోగించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నమ్ముతారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతికూలతలు తొలగిపోతాయి
హిందూ గ్రంథాల ప్రకారం.. ఒక ఆలయంలో లేదా ఇంటి పూజా మందిరంలో గంట మోగించడం వల్ల కంపనాలు ఏర్పడతాయి. దీని శబ్దం ఆలయం, ఇంటి చుట్టుపక్కల వాతావరణం నుంచి ప్రతికూలతను తొలగించడం ద్వారా సానుకూల శక్తిని వ్యాపింపజేస్తుంది. గంట మోగించడం వల్ల కేతు గ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి. కాబట్టి, రాహువు బలహీనంగా ఉన్నప్పుడు గంట మోగించాలని జ్యోతిష్య నిపుణులు తరచుగా సూచిస్తారు.
ఏకాగ్రత పెరుగుతుంది
అంతేగాక, గంట, దాని శబ్దం బ్రహ్మకు చిహ్నాలుగా పరిగణించబడతాయి. ఇది మీ దృష్టిని కేంద్రీకరించడానికి, అక్కడి వాతావరణాన్ని శుద్ధి చేయడానికి సహాయపడుతుంది. దాని శబ్దం మీలోని శక్తిని ఉత్తేజపరుస్తుంది. గంట శబ్దం మనస్సును ప్రశాంతపరుస్తుంది. మీరు దృష్టి కేంద్రీకరించడానికి సహాయపడుతుంది. ఇది ధ్యానం సమయంలో కూడా మీరు ఏకాగ్రతతో ఉండటానికి సహాయపడుతుంది. అందువల్ల, మీ ప్రార్థనలపై దృష్టి కేంద్రీకరించడానికి దీనిని పూజలో ఉపయోగిస్తారు.
ఏడు చక్రాలను మేల్కొలిపి..
గంటలు చైతన్యాన్ని పెంచే సాధనంగా కూడా పిలువబడతాయి. గంట శబ్దం శరీరంలోని ఏడు చక్రాల(మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార చక్రాలు)ను మేల్కొలిపి.. సమతుల్యతను కాపాడుతుంది. ఇది మతపరమైన దృక్కోణం నుంచి మాత్రమే కాకుండా శాస్త్రీయ దృక్కోణం నుంచి కూడా ముఖ్యమైనది. అందుకే దీనిని ప్రధానంగా మతపరమైన వేడుకలలో ఉపయోగిస్తారు. మన ఇళ్లలో ఉపయోగించే గంట గరుడ గంట. గంటపై ఉన్న గరుడ పక్షి భక్తుల సందేశాన్ని విష్ణువుకు తెలియజేస్తుందని నమ్ముతారు.
(Declaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించదు.)
