Faria Abdullah: అతడితో ప్రేమలో ఉన్నాను.. ఇద్దరం కలిసి డ్యాన్స్ .. ఫరియా అబ్దుల్లా కామెంట్స్..
తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్లలో ఫరియా అబ్దుల్లా ఒకరు. మొదటి చిత్రంతోనే అడియన్స్ హృదయాలు గెలుచుకుంది. దీంతో ఒక్కసారిగా ఈ అమ్మడు పాపులర్ అయ్యింది. ఆ తర్వాత వరుస సినిమాలతో అలరించింది.అలాగే సోషల్ మీడియాలో నిత్యం డ్యాన్స్ వీడియోస్ షేర్ చేస్తూ మెప్పిస్తుంది. తాజాగా ఈ అమ్మడు తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది.

టాలీవుడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2021లో జాతిరత్నాలు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీలో చిట్టి పేరుతో మరింత పాపులర్ అయ్యింది. ఆ తర్వాత తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు అందుకుంది. కానీ జాతిరత్నాలు స్థాయిలో హిట్టు అందుకోలేకపోయింది. కానీ సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్. నిత్యం ఫోటోషూట్స్, డ్యాన్స్ వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తన ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. సదరు యాంకర్ మీరు ప్రేమలో ఉన్నారా ? అని అడగ్గా.. సిగ్గుపడుతూ అవును అని తెలిపింది. ప్రేమలో ఉండటం తన జీవితాన్ని సమతుల్యంగా ఉంచుతుందని, తన బిజీ సినిమా షెడ్యూల్ కు మృదువైన మెరుపును అందిస్తుందని తెలిపింది.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఒకప్పుడు తోపు హీరోయిన్.. చిరంజీవితో ఎక్కువ సినిమాలు.. 3 పెళ్లిళ్లు.. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ..
తన ప్రియుడి గురించి చెబుతూ.. సినీరంగానికి చెందినవాడు కాదని.. కేవలం డ్యాన్స్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చాడని తెలిపింది. అతడు హిందువే అని స్పష్టం చేసింది. కానీ అతడి పేరు, ఫోటో గానీ రివీల్ చేయలేదు. ఇప్పుడు ఫరియా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుండగా.. ఆమె ప్రియుడి గురించి వెతుకుతున్నారు నెటిజన్స్. అతను కొరియోగ్రాఫర్, థియేటర్ నటుడు, పెయింటర్ లేదా చిత్రనిర్మాతనా? హైదరాబాద్ ఇంటర్నెట్ డిటెక్టివ్‌లు ఇప్పటికే ఆధారాల కోసం వెతుకుతున్నారు.
ఎక్కువమంది చదివినవి : Serial Actress : ఒడియమ్మ బంటీ.. త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా.. ?
సినిమాల్లోకి రాకముందు ఫరియా తన యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ డైరీస్ ద్వారా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అందులో తన హైదరాబాదీ జీవితం గురించి చెప్పుకొచ్చింది. జాతిరత్నాలు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె.. తర్వాత లైక్, షేర్ & సబ్‌స్క్రైబ్, రావణాసుర, ఆ ఒక్కటి అడక్కు, మత్తు వదలారా 2 చిత్రాల్లో నటించింది. కల్కి 2898 ADలో కూడా కనిపించింది. ఇటీవలే గుర్రం పాపిరెడ్డి సినిమాలో కనిపించింది. అలాగే తమిళంలో వల్లి మయిల్ సినిమాతో అరంగేట్రం చేయనుంది.
ఎక్కువమంది చదివినవి : Anantha Sriram: యూత్‌కు పిచ్చేక్కించేసిన పాట.. ఆ సాంగ్‌తో నా జీవితమే మారిపోయింది.. రచయిత అనంత్ శ్రీరామ్..
View this post on Instagram
ఎక్కువమంది చదివినవి : Actor : అమ్మోరు సినిమా వల్లే నా కెరీర్‌ని నాశనం.. సగం షూట్ అయ్యాక.. నటుడు సంచలన కామెంట్స్..
