AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anil Ravipudi: ఆ మూవీ ఫస్ట్ వెర్షన్ రామ్‌తో తీసి మధ్యలో ఆపేశాం.. ఓపెన్‌ సీక్రెట్ చెప్పిన అనిల్ రావిపూడి

దర్శకుడు అనిల్ రావిపూడి 'రాజా ది గ్రేట్' మూవీ గురించి, నటుడు రామ్‌తో ఆగిపోయిన ప్రాజెక్ట్ గురించి పలు కీలక విషయాలు చెప్పాడు. తమ్ముడు సినిమా దర్శకుడు అరుణ్ ప్రసాద్ తన బాబాయ్ అని, ఆయన సలహాలు తన సక్సెస్‌కు కారణమని తెలిపాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయంటే.. ఓ సారి లుక్కేయండి.

Anil Ravipudi: ఆ మూవీ ఫస్ట్ వెర్షన్ రామ్‌తో తీసి మధ్యలో ఆపేశాం.. ఓపెన్‌ సీక్రెట్ చెప్పిన అనిల్ రావిపూడి
Anil Ravipudi
Ravi Kiran
|

Updated on: Jan 21, 2026 | 1:42 PM

Share

టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్, ఇండస్ట్రీలోని రిలేషన్‌ల గురించి కీలక విషయాలు పంచుకున్నాడు. నటుడు రామ్‌తో ‘రాజా ది గ్రేట్’ చిత్రాన్ని చేయాలనే తన మొదటి ప్రయత్నమని.. అది ఎందుకు కార్యరూపం దాల్చలేదో వివరించాడు. ఈ ప్రాజెక్ట్ మొదటి వెర్షన్ ఒక లవ్ స్టోరీ అని.. ఇందులో విజువల్లీ ఛాలెంజ్డ్ అబ్బాయి ఒక అమ్మాయిని కాపాడటం ప్రధాన కథాంశమని తెలిపాడు. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు విచిత్ర సోదరులు లాంటి చిత్రాల నుంచి స్ఫూర్తి పొంది, ఒక డిసేబుల్డ్ పాత్రతో కమర్షియల్ సినిమా చేయవచ్చని నిరూపించాలనుకున్నట్లు చెప్పాడు. అయితే, సాంకేతిక కారణాల వల్ల.. అలాగే రామ్ “హైపర్” విడుదలయ్యాక బ్యాక్ టూ బ్యాక్ యాక్షన్ సినిమాలు చేయడం పట్ల ఆసక్తి చూపకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని అనిల్ పేర్కొన్నాడు. రామ్ తన వ్యక్తిగత కారణాలతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నప్పటికీ, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు.

ఇది చదవండి: ‘ఆ సాంగ్ వల్లే హీరోయిన్‌గా సినిమాలు మానేశా.!’

తమ్ముడు లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన అరుణ్ ప్రసాద్ తన బాబాయ్ అని అనిల్ రావిపూడి ఈ సందర్భంగా వెల్లడించాడు. అరుణ్ ప్రసాద్ తన తల్లి మేనత్త కొడుకు అని, ఇండస్ట్రీలోకి వచ్చేముందు ఇక్కడ పైకి రావడం, నిలబడటం కష్టం, కానీ కష్టపడి పని చెయ్, లక్ష్యం నుంచి పక్కకు తప్పుకోవద్దు అని తన బాబాయ్ ఇచ్చిన సలహా తనను ఎంతో ప్రభావితం చేసిందని అనిల్ తెలిపాడు. తన బాబాయ్ తన విజయం పట్ల ఎంతో గర్వంగా ఉన్నారని, తన ప్రతి సినిమా చూసి అభినందిస్తారని పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఏడాది పొడవునా డబ్బే డబ్బు.! ఎవర్‌గ్రీన్ బిజినెస్‌లు.. ఇప్పుడు వీటికే డిమాండ్

నిర్మాత భద్రతకు తాను తొలి ప్రాధాన్యత ఇస్తానని అనిల్ రావిపూడి స్పష్టం చేశాడు. ఒక నిర్మాత తనపై నమ్మకంతో పది కోట్లు పెడితే, అతనికి ఒక్క రూపాయి కూడా నష్టం రాకుండా, కనీసం లాభం రాకపోయినా నష్టం లేకుండా చూసుకోవడమే తన లక్ష్యమని చెప్పాడు. కమర్షియల్ సినిమా అనేది అందరికీ రీచ్ అవ్వాలని, దానికి అవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్‌ను స్క్రిప్ట్‌లో జోడించడంలో తాను వెనుకాడనని తెలిపాడు. కొంతమందికి తన విధానం నచ్చకపోవచ్చు, కొందరిని సంతృప్తిపరచలేకపోవచ్చని అంగీకరించాడు. అయితే, చివరికి సినిమా రెవెన్యూ, లాభనష్టాలే సక్సెస్‌ను డిఫైన్ చేస్తాయని అతడు అభిప్రాయపడ్డాడు.

భవిష్యత్‌లో దంగల్, ప్యాడ్ మ్యాన్ లాంటి ప్రయోగాత్మక, రియలిస్టిక్ సినిమాలు చేయాలని తనకు కోరిక ఉందని అనిల్ వెల్లడించాడు. తన రెమ్యునరేషన్‌ను తగ్గించుకొని, పరిమిత బడ్జెట్‌తో అలాంటి చిత్రాలు తీయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. కమర్షియల్ ఫార్మాట్‌తో పాటు, సింగీతం శ్రీనివాసరావు లాంటి దర్శకులు చేసిన విధంగా ప్రయోగాలు చేస్తూనే, వాటిని ప్రేక్షకులందరికీ చేరువ చేయాలని తన లక్ష్యమని అనిల్ రావిపూడి తెలిపాడు.

ఇది చదవండి: ఏడాది పొడవునా డబ్బే డబ్బు.! ఎవర్‌గ్రీన్ బిజినెస్‌లు.. ఇప్పుడు వీటికే డిమాండ్

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి