Balakrishna: బాలకృష్ణతో ఆ హీరోయిన్ ఒక్క సినిమాలోనూ నటించలేదు.. అసలు కారణం ఇదేనా.?
అతిలోక సుందరి శ్రీదేవి జీవితంలోని ఆసక్తికర విషయాలను సీనియర్ జర్నలిస్ట్ ఈమంది రామారావు ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 18 నెలల వయసు నుంచే నటన మొదలుపెట్టిన శ్రీదేవి, బాలనటిగా ఎదుర్కొన్న కష్టాలు, మలయాళ ఇండస్ట్రీలో ఆమె ఎదుగుదల, పదహారేళ్ళ వయసు చిత్రంతో వచ్చిన పాపులారిటీ గురించి ప్రస్తావించారు.

అతిలోక సుందరి శ్రీదేవి జీవితంలోని పలు అరుదైన సంఘటనలను సీనియర్ జర్నలిస్ట్ ఈమంది రామారావు ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. శ్రీదేవి చిన్నతనం నుంచి తనకు తెలుసని, మద్రాసులోని పెరియార్ రోడ్‌లో ఆమె కుటుంబంతో తనకు పరిచయం ఉందన్నారు. సినీ రిపోర్టర్‌గా తాను పని చేసిన రోజుల్లో శ్రీదేవి ఇంటికి వెళ్లేవాడినని, ఆమె తల్లి రాజేశ్వరి తన కుమార్తె గురించి ఆప్యాయంగా చెప్పేవారని గుర్తుచేసుకున్నారు. శ్రీదేవి కేవలం 18 నెలల వయసు నుంచే బాలనటిగా నటించడం ప్రారంభించిందని, ఆ డబ్బుతోనే కుటుంబ పోషణ జరిగేదని ఆమె అమ్మమ్మ రమణమ్మ చెప్పిన విషయాన్ని రామారావు వివరించారు. చిన్నతనం నుంచే శ్రీదేవి నటన పట్ల అంకితభావం చూపించేదని, ఆమెకు ప్రత్యేకంగా డ్యాన్స్ నేర్పినవారు లేరని, స్వయంగా ఆమె తల్లి రాజేశ్వరి, ఒకప్పుడు గ్రూప్ డ్యాన్సర్ అయినందున, ఇంట్లోనే శిక్షణ ఇచ్చేవారని తెలిపారు. శ్రీదేవి తండ్రి అయ్యప్ప ఒక అడ్వకేట్ అని, అయితే ఆయన శ్రీదేవి జీవితంలో ఎక్కువ భాగం దూరంగానే ఉన్నారని వెల్లడించారు.
ఇది చదవండి: ‘ఆ సాంగ్ వల్లే హీరోయిన్‌గా సినిమాలు మానేశా.!’
బాలనటిగా మా నాన్న నిర్దోషి, అనురాగం లాంటి చిత్రాలలో నటించిన తర్వాత, 10-14 ఏళ్ల మధ్య వయసులో ఆమెకు అవకాశాలు తగ్గాయని, ఆ సమయంలో ఆమె కొంత కష్టపడిందని చెప్పారు. దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన మా బంగారక్క చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో శ్రీదేవి మలయాళ ఇండస్ట్రీకి వెళ్ళింది. అక్కడ కేవలం వారం రోజులలో సినిమాలు పూర్తిచేసే షెడ్యూల్స్‌లో నటించారు. శ్రీదేవి జీవితంలో పెద్ద మలుపు తూర్పు వెళ్ళే రైలు(తమిళంలో 16 వయతినిలే) చిత్రం. ఈ చిత్రం ఆమెకు అద్భుత విజయాన్ని అందించింది. AVM స్టూడియోలో షూటింగ్ జరుగుతున్నప్పుడు, రూ.116 అడ్వాన్స్‌తో మొదలైన ఈ చిత్రం కమల్ హాసన్, రజనీకాంత్‌లతో కలిసి ఆమెకు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అక్కడి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
ఇది చదవండి: ఏడాది పొడవునా డబ్బే డబ్బు.! ఎవర్‌గ్రీన్ బిజినెస్‌లు.. ఇప్పుడు వీటికే డిమాండ్
కమల్ హాసన్, రజనీకాంత్‌లతో శ్రీదేవికి అద్భుతమైన కెమిస్ట్రీ ఉండేదని రామారావు వివరించారు. సీనియర్ ఎన్టీఆర్‌తో హీరోయిన్ శ్రీదేవి పలు హిట్ చిత్రాల్లో నటించింది. అయితే బాలకృష్ణతో మాత్రం ఒక్క చిత్రంలోనూ నటించలేదు. బాలకృష్ణతో ‘భలే దొంగలు’ అనే సినిమాలో నటించేందుకు శ్రీదేవికి అవకాశం వచ్చినా.. అప్పటికే హిందీలో డజన్‌కు పైగా సినిమాలతో ఆమె బిజీగా ఉండటంతో.. ఆ ఆఫర్ తిరస్కరించిందట. ఆ తర్వాత మరే అవకాశం బాలకృష్ణతో కలిసి నటించేందుకు రాలేదని టాక్. అటు ఇండస్ట్రీలో మరో టాక్ ఏంటంటే.? బాలయ్య.. తన తండ్రితో నటించిన హీరోయిన్‌తో సినిమా చేయనని చెప్పడంతో.. ఆ మేరకు ప్రయత్నాలు జరగలేదని సమాచారం. అయితే దీనిపై క్లారిటీ లేదు.
ఇది చదవండి: పరిటాల రవిని చంపిన మొద్దు శీను అవ్వాలనుకున్నది ఇదే.. కానీ చివరికి.!
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




