Watch Video: చూస్తుండగానే నేరుగా చెరువులోకి దూసుకెళ్లిన ఆర్మీ విమానం.. కాసేపటికే
Prayagraj plane crash : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఆర్మీ ట్రైనీ మైక్రోలైట్ విమానం సాంకేతిక లోపంతో కుప్పకూలింది. కేపీ కాలేజ్ సమీపంలో పొలాల్లో జరిగిన ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై ఎయిర్‌ఫోర్స్ అధికారులు ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించింది.

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో ఆర్మీ ట్రైనీ విమానం కుప్పకూలింది. కేపీ కాలేజ్ సమీపంలో విమానం పొలాల్లో కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇద్దరు పైలట్లు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇంజన్‌లో సాంకేతిక లోపంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
విమానం కూలిన ప్రాంతంలో చెరువు కూడా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఈ ప్రమాదంపై ఎయిర్‌ఫోర్స్ అధికారులు ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించించారు. మైక్రోలైట్ విమానం గాలిలో ఎగిరిన వెంటనే కుప్పకూలినట్టు ఎయిర్‌పోర్స్ అధికారులు వెల్లడించారు. ఇద్దరు పైలట్లను కేపీ కాలేజ్ విద్యార్ధులు రక్షించారని తెలిపారు.
వీడియో ఇక్కడ చూడండి..
प्रयागराज में एयरफोर्स का ट्रेनी विमान तालाब में गिरा.
माइक्रोलाइट एयरक्राफ्ट क्रैश.
नियमित परीक्षण उड़ान के दौरान हादसा.
रेस्क्यू अभियान जारी.
दोनों पायलट सुरक्षित.@SandhyaTimes4u @NBTDilli @NavbharatTimes pic.twitter.com/Vm9NvZoI1W
— सूरज सिंह/Suraj Singh 🇮🇳 (@SurajSolanki) January 21, 2026
మరన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
