AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం.. 95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే..?

పెళ్లిలో ఏడు అడుగులు వేశారు. జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్న ఒక జంట కలిసే జీవితాన్ని ముగించారు. మూడుముళ్లతో ఒక్కటైన ఈ జంట మరణంలోనూ కలిసి తుది వీడ్కోలు తీసుకున్నారు. ఈ విషాద సంఘటన కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు ఆ ఊరందరినీ తీవ్ర విషాదంలో ముంచేసింది. ఒక వృద్ధ దంపతులు మరణంలోనూ కలిసి ఉండటం చూసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం.. 95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే..?
Bihar Elderly Couple Dies Together
Jyothi Gadda
|

Updated on: Jan 21, 2026 | 2:39 PM

Share

జంటలు స్వర్గంలో ముడిపడతాయని అంటారు..కానీ, సమస్తిపూర్ జిల్లాలోని ఉజియార్పూర్ బ్లాక్‌ పరోరియా గ్రామానికి చెందిన ఒక వృద్ధ జంట ఈ మాటను వాస్తవమని నిరూపించారు. ఏళ్లతరబడి ఒకరినొకరు కష్ట, సుఖాల్లో కలిసి ఉన్నారు..చివరకు మరణాన్ని కూడా వారు కలిసి ఉండాలని వారు నమ్మకంగా ఉన్నారు. అందుకే భర్త మరణించిన కొద్దిసేపటికే భార్య కూడా తుది శ్వాస విడిచిపెట్టింది. ఈ సంఘటన ఆ ప్రాంతమంతా చర్చనీయాంశంగా మారింది.

బీహార్ లోని ఉజియార్‌పూర్‌లోని పరోరియా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. 95 ఏళ్ల రైతు యుగేశ్వర్ రాయ్ తన కుటుంబంతో చాలా కాలంగా సంతోషకరమైన జీవితాన్ని గడిపాడు. నిన్న రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. యుగేశ్వర్‌ మృతితో ఇంట్లో విషాదం నెలకొంది. చుట్టాలు, బంధువులు ఆయన అంత్యక్రియలకు సిద్ధమవుతోంది. తీరని దుఃఖంతో అతని భార్య..కన్నీరు మున్నీరుగా విలపించింది. తన భర్త నుండి విడిపోవడాన్ని భరించలేక ఆ 90 ఏళ్ల టెట్రి దేవి తనతోపాటే పయనమైంది.

తన జీవిత భాగస్వామి మృతదేహం పక్కన కూర్చుని ఓదార్చలేని విధంగా ఏడుస్తోంది. తన భర్త మరణంతో షాక్‌కు గురైన ఆమె అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. అలా కొన్ని క్షణాల్లోనే తను కూడా మరణించింది. ఆమె అచంచలమైన ప్రేమ ఫలితంగానే, ఒక్క క్షణం కూడా తన భర్త నుండి విడిపోవడాన్ని ఆమె భరించలేకపోయిందని గ్రామస్తులు అంటున్నారు. ఒకేసారి ఇద్దరు వృద్ధ దంపతుల మరణంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

ఇవి కూడా చదవండి

ఈ జంట కలిసి మరణించారనే వార్త వ్యాపించగానే, గ్రామంలో దుఃఖం అలలు అలుముకున్నాయి. ఈ హృదయ విదారకమైన సంఘటనతో ప్రజలు కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. వీరికి ముగ్గురు కుమారులు, ఇద్దరు వివాహిత కుమార్తెలు ఉన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
వశీకరణం అందుకే చేస్తారు.? కానీ దాని మంత్రాన్ని ఇలా వాడితే.!
వశీకరణం అందుకే చేస్తారు.? కానీ దాని మంత్రాన్ని ఇలా వాడితే.!
ఈ పండ్లు ఎక్క‌డైనా క‌నిపించాయా..? వెంటనే తెచ్చుకుని తినేయండి..!
ఈ పండ్లు ఎక్క‌డైనా క‌నిపించాయా..? వెంటనే తెచ్చుకుని తినేయండి..!
బాలకృష్ణతో ఆ హీరోయిన్ ఒక్క సినిమాలోనూ నటించలేదు..
బాలకృష్ణతో ఆ హీరోయిన్ ఒక్క సినిమాలోనూ నటించలేదు..
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసా..?
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసా..?
పేదవాడి బాదం.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆరోగ్యానికి ఢోకా లేదు..!
పేదవాడి బాదం.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆరోగ్యానికి ఢోకా లేదు..!
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి