Telangana Police: పోలీస్ స్టేషన్లకు వెళ్లడంలో ప్రజలు పడే ఇబ్బందులను తొలగించేందుకు తెలంగాణ CID దేశంలోనే తొలిసారిగా వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇకపై పోలీసులు బాధితుల ఇంటికి వెళ్లి ఫిర్యాదులను స్వీకరించి, అక్కడే FIR నమోదు చేస్తారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, పోక్సో, ర్యాగింగ్, SC/ST అట్రాసిటీ, ఆస్తి తగాదాలు వంటి కేసుల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.