Mrunal Thakur: ‘సీతారామం 2 ఉంటుందా ?’.. నెటిజన్ ప్రశ్నకు మృణాల్ ఆసక్తికర సమాధానం.. ఏంటంటే..
ముఖ్యంగా ఈ సినిమాతో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్‌కు తెలుగులో మంచి ఫ్యాన్స్ బేస్ లభించింది. వీరిద్దరు తమ సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత మృణాల్‌కు తెలుగులోనే ఎక్కువగానే ఆఫర్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
చాలా కాలం తర్వాత ప్రేక్షకులను మనసులను తాకిన క్లాసిక్ ప్రేమకథ సీతారామం. డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ మూవీలో మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండానే గతేడాది ఆగస్ట్ 5న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. మాస్ యాక్షన్ చిత్రాలే కాదు.. క్లాస్ సినిమాలను కూడా ఆడియన్స్ ఆదరిస్తారనే విషయాన్ని మరోసారి నిరూపించిన చిత్రమిది. వైజయంతి మూవీస్ పతాకంపై ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాతో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్‌కు తెలుగులో మంచి ఫ్యాన్స్ బేస్ లభించింది. వీరిద్దరు తమ సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత మృణాల్‌కు తెలుగులోనే ఎక్కువగానే ఆఫర్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. న్యాచురల్ స్టార్ నాని సరసన కొత్త ప్రాజెక్ట్ చేస్తుంది. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ క్రమంలో తాజాగా అభిమానులతో ట్విట్టర్ వేదికగా ముచ్చటించింది మృణాల్. ఆ సమయంలో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్లో ఆన్సర్స్ ఇచ్చింది. అయితే ఓ అభిమాని సీతారామం 2 గురించి ప్రశ్నించగా.. ఆసక్తికర ఆన్సర్ ఇచ్చింది మృణాల్. ‘సీతారామం 2 సాధ్యమేనా ?’ అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. మృణాల్ స్పందిస్తూ..”నాకు నిజంగా ఆలోచన లేదు.. కానీ నేను ఉండాలనుకుంటున్నాను” అని తెలిపింది. ఈ ఎపిక్ లవ్ స్టోరీకి సీక్వెల్ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది మృణాల్. ఈ క్రమంలోనే ఇటీవల ఆమె షేర్ చేసిన పిక్స్ పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీచ్ ఒడ్డున బోల్డ్ ఫోటోస్ షేర్ చేయగా.. సీతామహాలక్ష్మిని ఇలా ఊహించలేదని.. నీకు అనవసరంగా ఆ పాత్ర ఇచ్చారంటూ అసహనం వ్యక్తం చేశారు. అయితే ఆ ట్రోలింగ్ పై మృణాల్ స్పందించలేదు.
I have no idea but I really wish there is! https://t.co/tXwoRIQx47
— Mrunal Thakur (@mrunal0801) April 9, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.