Samantha: ‘ఈ రెండేళ్లలో ఊహించని పరిణామాలు.. జీవిత పాఠాలు ఎదురయ్యాయి’.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు..
వ్యక్తిగతంగా .. వృత్తిపరంగా వైఫల్యాలను.. విజయాలను మీరెలా తీసుకుంటారు ? భావోద్వేగాలను ఎలా సమతుల్యం చేస్తారు ? అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించగా.. విజయాలకన్నా.. అపజయాలు.. వైఫల్యాలు గొప్ప పాఠాలు నేర్పుతాయన్నారు. అపజయాలు ఎదురైనప్పుడే మరింత ఉత్తమంగా మారడానికి అవకాశం ఉంటుందన్నారు సామ్.
కాళిదాసు రచించిన ఆభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన అద్భుత దృశ్యకావ్యం శాకుంతలం. ఇందులో శకుంతల పాత్రలో సమంత.. దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో ప్రకాష్ మోహన్ బాబు, అల్లు అర్హ కీలకపాత్రలలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ మరో నాలుగు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఈ సందర్భంగా తాజాగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది సామ్. ఇందులో వ్యక్తిగతంగా .. వృత్తిపరంగా వైఫల్యాలను.. విజయాలను మీరెలా తీసుకుంటారు ? భావోద్వేగాలను ఎలా సమతుల్యం చేస్తారు ? అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించగా.. విజయాలకన్నా.. అపజయాలు.. వైఫల్యాలు గొప్ప పాఠాలు నేర్పుతాయన్నారు. అపజయాలు ఎదురైనప్పుడే మరింత ఉత్తమంగా మారడానికి అవకాశం ఉంటుందన్నారు సామ్.
అలాగే మరి కొన్ని రోజుల్లో సినిమా విడుదల కాబోతుంది. ఈ జర్నీని ఎలా భావిస్తున్నారని మరో నెటిజన్స్ ప్రశ్నించగా.. సామ్ స్పందిస్తూ.. “ఈ రెండు సంవత్సరాలలో ఊహించనివి చాలా జరిగాయి. జీవిత పాఠాలు… అనుకోని పరిస్థితులు ఎదురయ్యాయి. ఇప్పుడు దేనికైనా సిద్ధపడి ఉన్నానని అనుకుంటున్నాను. నా దగ్గరకు వచ్చిన పాత్ర చేసేటప్పుడు నేను భయపడుతూ చేస్తానా ?లేదా ? అని నన్ను నేను ప్రశ్నించుకుంటా.. జవాబు అవును అయితే ఆ పాత్ర ఖచ్చితంగా చేస్తాను” అంటూ చెప్పుకొచ్చారు.
అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్.. సెల్ఫ్ లవ్ ను మీ దృష్టిలో ఎలా చూస్తారు ? అని అడగ్గా.. మనం ఎప్పుడైతే ఇతరుల వైపు చూస్తు.. వారి గురించి చెప్పడం కన్నా.. మీతో మీరు సంతోషంగా ఉండడమే అని తెలిపారు సామ్. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా కనిపించనున్నారు.
Gosh!! So much has happened? Unimaginable things.. life lessons.. I guess I am prepared for anything now☺️#Shaakuntalam https://t.co/t6qZQOheFt
— Samantha (@Samanthaprabhu2) April 9, 2023
When you don’t look to others to define who you are? When you can be happy in your own company?#Shaakuntalam https://t.co/7k3ETtKZ67
— Samantha (@Samanthaprabhu2) April 9, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.