Tollywood: గేదెను చూపించి దానిమీద కూర్చోవాలని చెప్పాడు.. డైరెక్టర్ చేసిన పనికి షాకైన హీరోయిన్..
ఈ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ‘తంగళన్’ సినిమా షూటింగ్ కర్ణాటకలోని కోలార్‌లో జరిగింది. చాలా రోజుల పాటు అక్కడే సినిమా షూటింగ్ చేశారు. పీరియాడికల్ డ్రామా కావడంతో నటీనటులు గంటల తరబడి ఎండలో, దుమ్ములో మేకప్ వేసుకుని కూర్చోవాల్సి వచ్చింది.
నటీనటులు, నటీమణులకు సెట్స్‌లో చిత్రీకరణ చాలా సులభమైన పని అనుకుంటారు. కానీ కొన్ని సందర్బాల్లో ఔట్ డోర్ షూటింగ్ చేయాల్సిన సమయంలో నటులు, నటీమణులకు దాదాపు నరకంగా ఉంటుంది.. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ అవుట్ డోర్ లో షూట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు చాలా బడ్జెట్ సినిమాలు సెట్స్ పైనే షూట్ అవుతున్నాయి. కానీ నేటికీ చాలా మంది దర్శకులు తమ సినిమాలను అవుట్ డోర్ షూట్ చేస్తేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులో ఒకరు డైరెక్టర్ పా రంజిత్. ఈ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ‘తంగళన్’ సినిమా షూటింగ్ కర్ణాటకలోని కోలార్‌లో జరిగింది. చాలా రోజుల పాటు అక్కడే సినిమా షూటింగ్ చేశారు. పీరియాడికల్ డ్రామా కావడంతో నటీనటులు గంటల తరబడి ఎండలో, దుమ్ములో మేకప్ వేసుకుని కూర్చోవాల్సి వచ్చింది.
ఈ సినిమాలో నటించిన హీరోయిన్ మాళవిక మోహనన్ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఐదుగురు వేర్వేరు వైద్యుల వద్ద చికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని షూటింగ్ సమయంలో తాను పడిన కష్టాలను చెప్పుకొచ్చింది. మాళవిక మాట్లాడుతూ.. ‘కోలార్‌లో చాలా రోజుల పాటు కష్టపడి షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత నా ఆరోగ్యం క్షీణించింది. ఐదుగురు వైద్యులతో చికిత్స చేయించాల్సి వచ్చింది. స్కిన్, ఐ స్పెషలిస్ట్‌లను కూడా నన్ను పరీక్షించారు. కోలార్ ఎండలకు నేను అలిసిపోయాను. మేకప్ కోసం రోజూ ఐదు గంటలు పట్టింది. ఆ తర్వాత కూడా ఎక్కువ భాగం ఎండలోనే ఉండాల్సి వచ్చింది. దీంతో విపరీతమైన దుమ్ము ఉండిపోయాను. ఆ దుమ్ములోనే షూట్ చేయాల్సి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది.
‘ఒకరోజు నేను మేకప్ మొత్తం వేసుకుని కూర్చున్నాను. అప్పుడు సెట్లో ఒక పెద్ద గేదె కనిపించింది. దర్శకుడు రంజిత్ దానిని చూపించి గేదె ఎలా ఉంది అని అడిగాడు. ఇది బానే ఉందని చెప్పాను. వెంటనే వెళ్లి దాని మీద కూర్చో అన్నాడు. నేను మొదట నమ్మలేకపోయాను. తర్వాత రంజిత్ మళ్లీ అదే చెప్పడంతో షాక్ అయ్యాను. ఇప్పటి వరకు నేను గేదెను కూడా ముట్టుకోలేదు. ఇప్పుడు ఎలా వెళ్లి గేదె మీద కూర్చోవాలా అని కంగారు పడ్డాను. భయంతో ఆ షాట్ పూర్తి చేశాను’ అని మాళవిక మోహనన్ తెలిపింది. ‘తంగళన్’ సినిమాలో మాళవిక మోహనన్ ‘ఆర్తి’ అనే వింత మహిళగా నటించింది. సినిమా కథ జరిగే ప్రాంతంలో నివసించే వారిని వెంటాడే దెయ్యంలా ఉంటుంది పాత్ర. ‘తంగళన్’ సినిమాలో విక్రమ్ హీరోగా నటించాడు. ఆగస్ట్ 15న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.