Tollywood: ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడిన హీరోయిన్.. 50 ఏళ్ల వయసులో కొత్త ప్రియుడి కోసం పోస్టులు…
ఇద్దరూ కలిసి ప్రైవేట్ ఫంక్షన్స్, పార్టీలలో పాల్గొన్నారు. అదే సమయంలో ఇద్దరి వయసు వ్యత్సాసం గురించి అనేక ట్రోలింగ్స్ జరగ్గా.. తమదైన శైలీలో స్పందించారు. కానీ ఇప్పుడు వీరిద్దరు విడిపోయారనే టాక్ నడుస్తుంది. అర్జున్‌తో మలైకా విడిపోయిందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై అర్జున్, మలైకా ఇద్దరూ స్పందించలేదు.
బాలీవుడ్ మలైకా అరోరా ఎప్పుడూ వృత్తిపరంగా కాదు, వ్యక్తిగత జీవితం వల్ల వార్తల్లో నిలుస్తుంది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సల్మాన్ ఖాన్ సొదరుడు అర్భాజ్ ఖాన్ ను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బాబు ఉన్నాడు. పెళ్లైన 19 ఏళ్ల తర్వాత తన భర్త అర్బాజ్ ఖాన్‌తో మలైకా విడాకులు తీసుకుంది. ఆ తరువాత హీరో అర్జున్ కపూర్ తో ప్రేమలో పడింది. చాలా కాలంపాటు వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారు. ఇద్దరూ కలిసి ప్రైవేట్ ఫంక్షన్స్, పార్టీలలో పాల్గొన్నారు. అదే సమయంలో ఇద్దరి వయసు వ్యత్సాసం గురించి అనేక ట్రోలింగ్స్ జరగ్గా.. తమదైన శైలీలో స్పందించారు. కానీ ఇప్పుడు వీరిద్దరు విడిపోయారనే టాక్ నడుస్తుంది. అర్జున్‌తో మలైకా విడిపోయిందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై అర్జున్, మలైకా ఇద్దరూ స్పందించలేదు.
ఓవైపు సోషల్ మీడియాలో బ్రేకప్ పుకార్లు చక్కర్లు కొడుతుండగా.. మలైకా ఓ మిస్టరీ మ్యాన్‌తో దిగిన ఫోటోను పోస్ట్ చేసింది. దీంతో ఈ బ్యూటీ మూడో సారి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. తాజాగా మలైకా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్‌ను పోస్ట్ చేసింది. ‘ప్రతి ఆనందం… ప్రేమపూర్వకమైన పదం… ప్రతి చర్య మన ఆత్మ సౌందర్యానికి ప్రతిబింబం.’ అంటూ ఇన్ స్టాలో మలైకా చేసిన పోస్ట్ వైరలవుతుంది.
ఇదిలా ఉంటే.. మరోవైపు అర్జున్ కపూర్ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు చేస్తున్నాడు. అలాగే అర్జున్ కపూర్ పుట్టినరోజు సెలబ్రేషన్లలో మలైక కనిపించకపోవడంతో వీరిద్దరి బ్రేకప్ వార్తలకు మరింత బలం చేకూరింది. అంతేకాదు సోషల్ మీడియా ద్వారా కూడా మలైకా అర్జున్‌కి శుభాకాంక్షలు చెప్పలేదు. 5 సంవత్సరాల డేటింగ్ తర్వాత, అర్జున్, మలైకా విడిపోయినట్లుగా తెలుస్తోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.