Madhumitha: భర్తతో కలిసి మధుమిత మాస్ డ్యాన్స్.. ఊ అంటావా మావా అంటూ అదిరిపోయే స్టెప్పులు..
ఓ కోలీవుడ్ సినిమాలో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకున్న శివ- మధుమిత.. మొదటిసారిగా ఒకరికొకరు పరిచయమయ్యారు. ఇద్దరి మనసులు కలిశాయి. ఆపై పెద్దల అంగీకారంతో వేదమంత్రాల సాక్షిగా పెళ్లిపీటలెక్కారు. వీరి అన్యోన్య దాంపత్య బంధానికి గుర్తుగా ధన్విన్, గగన్ అనే ఇద్దరు కుమారులున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో నటుడు శివబాలాజీ- మధుమిత జోడి ఒకటి. వీరిద్దరూ హీరో, హీరోయిన్లుగా సినిమా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించి మెప్పించారు. ఓ కోలీవుడ్ సినిమాలో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకున్న శివ- మధుమిత.. మొదటిసారిగా ఒకరికొకరు పరిచయమయ్యారు. ఇద్దరి మనసులు కలిశాయి. ఆపై పెద్దల అంగీకారంతో వేదమంత్రాల సాక్షిగా పెళ్లిపీటలెక్కారు. వీరి అన్యోన్య దాంపత్య బంధానికి గుర్తుగా ధన్విన్, గగన్ అనే ఇద్దరు కుమారులున్నారు. కాగా పెళ్లి తర్వాత శివబాలాజీ నటుడిగా కొనసాగుతున్నారు. మధుమిత మాత్రం యాక్టింగ్‌కు దూరంగా ఉండిపోయింది. అప్పుడప్పుడు కొన్ని టీవీ షోల్లో కనిపిస్తుంటుంది. అలాగే సోషల్ మీడియాలోనూ సందడి చేస్తుంటుంది. తన భర్త, పిల్లలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. కాగా సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా శివబాలాజీతోనే కనిపిస్తుంది మధుమిత. తాజాగా ఈ లవ్లీ కపుల్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలోని స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మావ.. ఉఊ అంటావా’ పాటకు స్టెప్పులేశారు.
ఈ సందర్భంగా దంపతులిద్దరూ స్టైలిష్ అండ్ ఫ్యాషనబుల్ దుస్తుల్లో ముస్తాబై ఎంతో హుషారుగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఇదెక్కడ జరిగిందో క్లారిటీ లేదు కానీ ఓ పార్టీ ఈవెంట్‌లో వీరూ డ్యాన్స్ చేసినట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఆట సందీప్ కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాంగ్‌లో మధుమిత డ్రెస్సింగ్ స్టైల్, ఎక్స్‌ప్రెషన్స్ అద్భుతంగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. 10th క్లాస్ డైరీలో శివబాలాజీ- మధుమిత ఇద్దరూ జంటగా కనిపించారు. ప్రస్తుతం శివబాలాజీ శాకుంతలం సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..