Upasana Konidela: మా పిల్లలను అలానే పెంచుతాం.. నెగిటివ్‌గా రాయకండి.. ఉపాసన ఆసక్తికర కామెంట్స్
అపోలో హెల్త్ మ్యాగజైన్ నిర్వాహకురాలిగా హెల్త్ కౌన్సిలర్ గా వ్యవహరిస్తున్నారు ఉపాసన . రామ్ చరణ్ భార్యగా, బిజినెస్ ఉమన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు ఉపాసన.
సెలబ్రెటీల పై కొంతమంది నేటిగిటివిటీ స్ప్రెడ్ చేస్తారని మనకు తెలుసు.. కావాలనే టార్గెట్ చేసి దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు. తాజాగా మెగా కోడలు ఉపాసన పై కూడా కొందరు నేటిగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారట. ఈ విషయాన్నీ ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అపోలో హెల్త్ మ్యాగజైన్ నిర్వాహకురాలిగా హెల్త్ కౌన్సిలర్ గా వ్యవహరిస్తున్నారు ఉపాసన . రామ్ చరణ్ భార్యగా, బిజినెస్ ఉమన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు ఉపాసన. ఇటీవలే తనకు గర్భవతిని అని కూడా ప్రకటించి అభిమానుల్లో సంతోషాన్ని నింపారు. ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆమె ఎలాంటి పోస్ట్ చేసినా ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్ల గురించి ఉపాసన ఘాటుగా స్పందించారు.
నేను గోల్డెన్ స్పూన్ తో పుట్టానని అంటున్నారు. కానీ తన తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డా రు అని ఉపాసన కొణిదెల తెలిపారు. విశ్రాంతి తీసుకోకుండా నిరంతర వృత్తిపరమైన బాధ్యతలతో చాలా బిజీగా ఉన్నానని అన్నారు ఉపాసన. చరణ్ తాను తమ పిల్లలను కూడా అలాగే పెంచుతామని తెలిపారు. దయచేసి నా గురించి నెగెటివ్ గా రాసి నెగెటివిటీని స్ప్రెడ్ చెయ్యొద్దు అని ఉపాసన కోరారు.
ఇక రామ్ చరణ్ ఉపాసన ఎంతో అన్యుణ్యంగా ఉంటారు. చరణ్ సినిమాలకు గ్యాప్ దొరికిన ప్రతిసారి భార్యతో కలిసి విదేశాలకు వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తోంది.Upasana
View this post on Instagram