- Telugu News Photo Gallery Cinema photos Actress Samyuktha Says Interesting Facts About Her Life and Career telugu cinema news
Samyuktha: హీరోయిన్ కావాలనుకోలేదు.. కానీ వరుస హిట్లతో అల్లాడించేస్తోంది.. తెలుగులో సత్తా చాటుతున్న సంయుక్త..
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస హిట్స్ అందుకుంటూ టాప్ హీరోయిన్గా సత్తా చాటుతుంది సంయుక్త. ఇటీవల విడుదైలన సార్ చిత్రంలో మరో సూపర్ హిట్ ఖాతలో వేసుకుంది.
Updated on: Feb 22, 2023 | 1:52 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస హిట్స్ అందుకుంటూ టాప్ హీరోయిన్గా సత్తా చాటుతుంది సంయుక్త. ఇటీవల విడుదైలన సార్ చిత్రంలో మరో సూపర్ హిట్ ఖాతలో వేసుకుంది.

భీమ్లా నాయక్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ సరసన బింబిసార చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక ఇప్పుడు ధనుష్ సరసన సార్ చిత్రంలో నటించి మెప్పించింది.

ఫిబ్రవరి 17న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సామాజిక ఇతివృత్తంతో కమర్షియల్ ఫార్ములాలో రూపొందిన వాతీ చిత్రంలో ధనుష్ నటనతోపాటు.. సంయుక్త నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి.

ఇటు తెలుగులోనే కాకుండా.. మలయాళంలోనూ వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను కేరళ రాష్ట్రంలోని చిన్న గ్రామంలో పుట్టానని, సినిమాపై పెద్దగా ఆసక్తి లేకపోయిన తన చుట్టూ ఉన్నవారితో ఏదో ఒక చిత్రంలో నటించానని చెప్పుకోవాలని ఆశపడ్డానన్నారు.

అలా ఒక చిత్రంలో నటించిన తర్వాత ఇక చాలు అనుకొని చదువుపై దృష్టి పెట్టానన్నారు. ేఅలా సినిమాలకు ఏడాది దూరమయ్యాయని చెప్పుకొచ్చారు.

అయితే విధి తనను మళ్లీ సినిమాల్లోకే తీసుకువచ్చిందని.. అలా నటిస్తూ సినిమాను ప్రేమించడం స్టార్ట్ చేసినట్లు తెలిపింది.

ఇప్పుడు సినిమానే జీవితంగా మారిపోయిందని.. నటిగా వైవిధ్యభరితమైన కథాపాత్రలు పోషించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.




