Madhubala: ఓ మై గాడ్.. మధుబాల కుమార్తెలను చూశారా..? వారికి అమ్మ అందమే వచ్చింది
పరువం వానగా నేడు కురిసిందిలే.. నా చెలి రోజావే లాంటి సాంగ్స్ వినిపిస్తే కళ్ళముందు కదలాడే ఒకే ఒక్క రూపం మధుబాల. అందం, అభినయం కలబోసిన రూపం. ఒక్క మూవీతో ఇండస్ట్రీని ఏలిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు రీ ఎంట్రీలోనూ అదరగొడుతోంది. మధుబాల కుమార్తెలు కూడా ఎంతో అందంగా ఉన్నారు..
మధుబాల 90వ దశకంలో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా రాణించింది. 1991లో కె బాలచందర్ డైరెక్ట్ చేసిన అళగన్‌తో ఇండస్ట్రీకి పరిచయమైన మధు.. మణిరత్నం తీసిన రోజా మూవీతో ఊహించని ఇమేజ్ దక్కించుకుంది. తన క్యూట్ యాక్టింగ్, క్రేజీ అందంతో ఆడియెన్స్ హృదయాలకు కొల్లగొట్టింది. కుర్రకారు అయితే ఆమెకు అందాల దేవతగా ఆరాదించారు. తెలుగు, హిందీ , తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో చక్రం తిప్పి మంచి సినిమాలు చేసింది మధుబాల. తెలుగులో అల్లరి ప్రియుడు, ఆవేశం, గణష్, చిలక్కొట్టుడు మూవీస్‌లో యాక్ట్ చేసింది. కాగా హేమా మాలిని, జుహీ చావ్లాలకు బంధువు అయిన ఆనంద్ షాను 1999 ఫిబ్రవరి 19న మ్యారేజ్ చేసుకుంది. ఈ కపుల్‌కు అమెయా, కెయా అనే ఇద్దరు అందమైన కుమార్తెలు ఉన్నారు.
పెళ్లి తర్వాత.. ఇండస్ట్రీకి కొంత బ్రేక్ ఇచ్చిన మధుబాల.. సెకండ్ ఇన్సింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మళ్లీ వెండితెరపైకి వచ్చారు. ఇటీవల తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తున్నారు. శాకుంతలం, ప్రేమదేశం, ఈగల్ సినిమాల్లో కీ రోల్స్ చేశారు. మంచు విష్ణు హీరోగా చేస్తోన్న కన్నప్పలోనూ కీలక పాత్ర చేశారు. ఈ సినిమా త్వరలో రిలీజ్‌కు సిద్దమైంది. మధుబాల కూతుర్లు కూడా ఎంతో అందంగా ఉన్నారు. అచ్చం అమ్మ అందమే వారికీ వచ్చింది. మధుభాల ఎప్పుడైనా తన కుమార్తెలు ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తే అవి వైరల్ అవతున్నాయి. థ్యాంక్స్ క్వీన్.. ఈ జనరేషన్‌కు ఇద్దరు ప్రిన్సెస్‌లను ఇచ్చావ్ అని క్రేజీ కామెంట్స్ పెడతున్నారు. మరీ అమెయా, కెయాలకు మూవీస్‌పై ఆసక్తి ఉందా..? వారు ఇండస్ట్రీకి వస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.