Madhubala: వారెవ్వా.. అందంలో తల్లిని మించిన కూతుర్లు.. మధుబాల కుమార్తెలను చూశారా.. ?
ఒకప్పుడు దక్షిణాదిలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో మధుబాల ఒకరు. 90వ దశకంలో కుర్రాళ్ల రాకుమారిగా ఉన్న ఆమె.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పటికీ సినిమాల్లో సహాయ పాత్రలు పోషిస్తూ దూసుకుపోతుంది. ఇటీవలే కన్నప్ప సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది.

మధుబాల.. ఒకప్పుడు సౌత్ కుర్రాళ్ల ఆరాధ్య దేవత. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ సెన్సేషన్ అయ్యింది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. 90వ దశకంలో దక్షిణాదిలోని అగ్ర హీరోయిన్లలో ఆమె ఒకరు. అందం, అభినయంతో మెస్మరైజ్ చేసిన ఆమె.. ఇప్పటికీ ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటుంది. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన రోజా సినిమాతో తమిళంతోపాటు తెలుగులోనూ స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. ఈ మూవీతో ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. అందం, అంతకు మించిన అమాయకత్వంతో కట్టిపడేసింది. తెలుగులో అల్లరి ప్రియుడు, ఆవేశం, గణేష్, చిలక్కొట్టుడు వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..
అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే వ్యాపారవేత్త ఆనంద్ షాను 1999లో పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ హీరోయిన్స్ హేమామాలిని, జూహీ చావ్లాలకు ఆనంద్ షా దగ్గరి బంధువు. ఈ దంపతులకు అమెయా, కెయా అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. పెళ్లి తర్వాత చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీగా ఉంటుంది. శాకుంతలం, కన్నప్ప చిత్రాల్లో కీలకపాత్రలు పోషించింది. అలాగే తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషిస్తుంది.
ఇవి కూడా చదవండి : Actress : అబ్బబ్బ.. ఏం అందం రా బాబూ.. 42 ఏళ్ల వయసులో టెన్షన్ పుట్టిస్తోన్న వయ్యారి..
ఇదిలా ఉంటే.. తాజాగా మధుబాల కూతుర్ల ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇద్దరూ అందంలో తల్లిని మించిపోయారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మధుబాల కూతుర్లలో కియా షా త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆమె ఎక్కువగా తన తల్లితో కలిసి సినిమా ఈవెంట్స్, బాలీవుడ్ పార్టీలలో ఎక్కువగా కనిపిస్తుంటుంది.
ఇవి కూడా చదవండి : Suriya: ఏముందిరా.. అందమే అచ్చు పోసినట్లు.. సూర్య కూతురిని చూశారా.. ?
ఇవి కూడా చదవండి : Pelli Sandadi Movie: ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. పెళ్లి సందడి సినిమాలో స్వప్నసుందరి.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Ramya Krishna: రమ్యకృష్ణ కొడుకును చూశారా..? తనయుడితో కలిసి శ్రీవారి దర్శనం.. వీడియో వైరల్..







