Actress : క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు.. 17 ఏళ్లకే ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోవాలనుకున్నా.. హీరోయిన్..
సినీరంగంలో క్యాస్టింగ్ కౌచ్ వేధింపులకు ఇప్పటికే చాలా మంది బయటపెట్టారు. తాజాగా మరో హీరోయిన్ సైతం తనకు ఎదురైన పరిస్థితులను వెల్లడించారు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొన్నాళ్లకే అంటే తాను 17 ఏళ్లకే సినిమాలను వదిలేసి వెళ్లిపోవాలనుకున్నట్లు తెలిపారు. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది హీరోయిన్ మదాలస శర్మ. అల్లరి నరేష్ హీరోగా నటించిన ఫిట్టింగ్ మాస్టర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. కొన్నాళ్ల క్రితం ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తుచేసుకున్నారు. కొన్నేళ్ళ తర్వాత సౌత్ ఇండస్ట్రీని ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో వివరించారు.
ఇవి కూడా చదవండి : Maheshwari : పెళ్లి సినిమా హీరోయిన్ గుర్తుందా.. ? ఆమె కూతురు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్..
“కెరీర్ ప్రారంభంలో నాకు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నేను ఆ దారిలో ముందుకు వెళ్లలేనని నాకు అనిపించింది. క్యాస్టింగ్ కౌచ్ వంటివి అన్ని చోట్లా ఉంటాయి. 17 ఏళ్ల వయసులో ఓ సంభాషణ నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. అలా అనిపించగానే అక్కడి నుంచి బయటకు వచ్చేసి ముంబై తిరిగి వెళ్లిపోవాలని అనుకున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి : Actor : ఒకప్పుడు మామిడి కాయలు అమ్మాడు.. ఇండస్ట్రీలోనే టాప్ నటుడు.. ఒక్కో సినిమాకు కోట్ల రెమ్యునరేషన్..
మదాలస శర్మ.. తెలుగులో వరుస సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. 2009లో ఫిట్టింగ్ మాస్టర్ తర్వాత శౌర్య, ఆలస్యం అమృతం, మేము వయసుకు వచ్చాం, రామ్ లీల వంటి చిత్రాల్లో నటించారు. 2018లో మిథున్ చక్రవర్తి కుమారుడు మాహా అక్షయ్ చక్రవర్తిని వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.

Madalasa Sharma Movies
ఇవి కూడా చదవండి : Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. బ్రహ్మానందంపై అలాంటి మాటలా.. ?




