జనాలు నా గురించి అలా సర్చ్ చేయడం బాధగా ఉంది.. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు..
సినిమా హీరోయిన్స్ గురించి నెటిజన్స్ గూగుల్ లో సర్చ్ చేయడం చాలా కామన్. తమ అభిమాన హీరోయిన్స్ గురించి అని విషయాలు గూగుల్లో వెతుకుతారు. అలాగే హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు నెటిజన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అలాగే తాజాగా ఓ హీరోయిన్ గురించి నెటిజన్స్ గూగుల్ లో తెగ సర్చ్ చేస్తున్నారు.
సినిమా హీరోయిన్స్ పై ప్రేక్షకులకు సపరేట్ క్రేజ్ ఉంటుంది. కుర్రకారు హీరోయిన్స్ ను ఆరాధ్య దేవతలుగా ఫీల్ అవుతుంటారు. తన అభిమాన హీరోయిన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఆ హీరోయిన్స్ గురించి గూగుల్ లో తెగ గాలిస్తూ ఉంటారు. కాగా ఈ ఏడాది ఓ హీరోయిన్ గగురించి గూగుల్ లో తెగ వెతికేశారు. ఈ ఏడాది ఎక్కువమంది వెతికిన హీరోయిన్స్ లో ఓ అందాల భామ కూడా ఉంది. అయితే ఆమెను గూగుల్ లో వెతకడం బాధగా అనిపించింది అంటుంది ఆ బ్యూటీ ఇంతకూ ఆమె ఎవరు.? గూగుల్ లో ఆమె గురించి నెటిజన్స్ ఏమని సర్చ్ చేశారు.? గూగుల్ లో ఎక్కువ మంది వెతికిన హీరోయిన్స్ లో తృప్తి డిమ్రి మొదటి స్థానంలో ఉంది. అలాగే మరో భామ కూడా ఈ లిస్ట్ లోఉంది. ఆమె మరెవరో కాదు..
ఇది కూడా చదవండి : CM.Revanth Reddy: సీఎం. రేవంత్ రెడ్డి ఫేవరెట్ టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..? అస్సలు ఊహించలేరు గురూ..
బాలీవుడ్ ప్రముఖ నటి హీనా ఖాన్ తనకు స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ వార్తను తన అభిమానులతో పంచుకున్నప్పుడు, అందరూ షాక్ కు గురయ్యారు. అయితే, తాను క్యాన్సర్‌కు భయపడనని, ఈ వ్యాధితో పోరాడతానని హీనా చెప్పింది. ఆమె పోరాటం చాలా మంది క్యాన్సర్ రోగులకు ధైర్యాన్ని ఇస్తుంది, అందుకే ఆమె తన వ్యాధికి సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో పంచుకుంటుంది.
ఇది కూడా చదవండి :Jr.NTR : నేను ఎన్టీఆర్ గురించి తప్పుగా మాట్లాడలేదు: కౌశిక్ తల్లి
హీనా ఖాన్ దైర్యంగా తన వ్యాధిని ఎదుర్కొంటుంది. అయితే హీనా ఖాన్ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడటంతో సోషల్ మీడియాతో పాటు గూగుల్ లోనూ ఆమె గురించి నెటిజన్స్ సర్చ్ చేశారు. గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్-10 హీరోయిన్స్ లో ఈ అమ్మడు పేరు కూడా ఉంది. అయితే ఆ లిస్ట్ లో తన పేరు ఉండటం బాధగా అనిపించింది అని అంటుంది హీనా ఖాన్. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. మోస్ట్ సెర్చ్‌లో ఉండే పరిస్థితి ఎవరికీ రావొద్దని కోరుకుంటున్నట్టు ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది హీనా ఖాన్.
View this post on Instagram
హీనా ఖాన్ ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి