Rajinikanth: రజినీకాంత్‌కు లవర్‌గా అమ్మగా, భార్యగా నటించిన ఏకైక హీరోయిన్.. ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్
భారత దేశంలో అత్యధిక పారితోషకం తీసుకునే నటుల్లో ఒకరైన రజనీ నిజ జీవితంలో చాలా సామాన్యుడిలా జీవిస్తారు. సాధారణ దుస్తులు ధరిస్తారు. మారువేషం దాచుకుని, బస్సులు, పార్కుల్లో తిరుగుతూ వార్తల్లో కనిపిస్తుంటారు. రజనీకాంత్ సింప్లిసిటీ గురించి ఇప్పటికే అనేక కథనాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.
సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సూపర్ స్టార్ గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు రజినీకాంత్. తన డాషింగ్ స్టైల్, మేనరిజం, టాలెంట్ తో అభిమానులను ఫిదా చేశారు రజినీకాంత్. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబట్టాయి. 74 ఏళ్ల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. దాంతో పాటే.. కోట్లలో ఆస్తులను కూడా సంపాదించేసి.. వన్ ఆఫ్ ది రిచెస్ట్ యాక్టర్‌గా.. ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో కొనసాగుతున్నారు రజినీ. ఇక రజినీ ఆస్తుల విషయానికి వస్తే.. లైఫ్ స్టైల్ ఏషియా నివేదిక ప్రకారం రజనీకాంత్ నికర విలువ 430 కోట్లు. అలాగే ఒక్కో సినిమాకు 100 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు ఈ స్టార్. జైలర్ సినిమాతో భారీ హిట్ అందుకున్న రజినీకాంత్.
ఇది కూడా చదవండి : CM.Revanth Reddy: సీఎం. రేవంత్ రెడ్డి ఫేవరెట్ టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..? అస్సలు ఊహించలేరు గురూ..
రీసెంట్ గా వేట్టయన్ సినిమాతో మరో హిట్ అందుకున్నారు రజినీకాంత్. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలను లైనప్ చేశారు రజినీకాంత్. లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్నారు రజినికాంత్. అలాగే వెంకట్ ప్రభు దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నారని తెలుస్తుంది. వీటితో పాటు నెల్సన్ తో కలిసి జైలర్ 2 సినిమాను కూడా చేయనున్నారు రజినీకాంత్. ఇదిలా ఉంటే తాజాగా రజినీకాంత్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఇది కూడా చదవండి :Jr.NTR : నేను ఎన్టీఆర్ గురించి తప్పుగా మాట్లాడలేదు: కౌశిక్ తల్లి
సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంతో మందితో కలిసి నటించారు. అలాగే ఎంతో మంది హీరోయిన్స్ తో కలిసి పని చేశారు. అయితే రజినీకాంత్ పక్కన లవర్‌గా, అమ్మగా, భార్యగా నటించిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె చిన్న హీరోయిన్ కూడా కాదు ఆమె ఓ స్టార్ హీరోయిన్.. వందల కోట్లకు అధిపతి ఆ హీరోయిన్. ఆమె మరెవరో కాదు అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి. అవును శ్రీ దేవి మూండ్రు ముదిచు సినిమాలో రజినీకాంత్ తల్లిగా నటించింది. ఈ సినిమా తర్వాత రజినీకాంత్ శ్రీదేవి కాంబినేషన్‌లో 22 సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల్లో శ్రీదేవి లవర్ గా, భార్యగా నటించింది.