హన్సిక మెరుపులు.. యాపిల్ బ్యూటీ వయ్యారాలు మాములుగాలేవుగా..
హన్సిక మోత్వానీ తెలుగు ,తమిళ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ అందంతో పాటు నటనపరంగాను ప్రేక్షకులను మెప్పించింది.. ఈ ముద్దుగుమ్మ ఆగస్టు 9, 1991న ముంబైలో సింధీ హిందూ కుటుంబంలో జన్మించింది. హన్సిక తన సినీ కెరీర్ ను బాల నటిగా ప్రారంభించింది.
Updated on: Mar 26, 2025 | 2:12 PM

హన్సిక మోత్వానీ తెలుగు ,తమిళ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ అందంతో పాటు నటనపరంగాను ప్రేక్షకులను మెప్పించింది.. ఈ ముద్దుగుమ్మ ఆగస్టు 9, 1991న ముంబైలో సింధీ హిందూ కుటుంబంలో జన్మించింది.

హన్సిక తన సినీ కెరీర్ ను బాల నటిగా ప్రారంభించింది. 2001లో "షకలక బూమ్ బూమ్" వంటి టీవీ సీరియల్స్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. ఆ తర్వాత "హవా", "కోయ్ మిల్ గయా", "అబ్రక దబ్రా" వంటి హిందీ సినిమాల్లో కూడా కనిపించింది.

2007లో వచ్చింది, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన "దేశముదురు" సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ సినిమా హిట్ కావడంతో ఈ బ్యూటీకి తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి. తక్కువ సమయంలోనే స్టార్ గా మారిపోయింది.

"కంత్రి", "మస్కా" , "బిల్లా", "కందిరీగ", "ఓ మై ఫ్రెండ్", "దేనికైనా రెడీ" వంటి సినిమాల్లో నటించి మెప్పించింది తెలుగులోనే కాదు తమిళ్ లోనూ నటించింది. . తమిళ సినిమా పరిశ్రమలో "మప్పిళై" (2011)తో అడుగుపెట్టి, "వెలాయుధం", "ఒరు కల్ ఒరు కన్నడి", "సింగం II", "అరణ్మనై" వంటి విజయవంతమైన చిత్రాలతో పేరు తెచ్చుకుంది.

2022లో హన్సిక సోహైల్ కతూరియాను వివాహం చేసుకుంది. ఇటీవల ఆమె తన సరికొత్త BMW 6 GT లగ్జరీ కారుతో వార్తల్లో నిలిచింది. ఇక సోషల్ మీడియాలో హన్సిక చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ కొన్ని క్రేజీ ఫోటోలను పంచుకుంది.





























