నాగార్జున- ప్రవీణ్ సత్తారు సినిమాలో మరో హీరోయిన్… టాలీవుడ్‏కు ఎంట్రీ ఇవ్వనున్న బాలీవుడ్ బ్యూటీ..

ప్రస్తుతం బాలీవుడ్ భామల చూపు మొత్తం తెలుగు ఇండస్ట్రీపై పడిందనే చెప్పుకోవాలి. ఇప్పటికే అలియా భట్, దీపిక పదుకునే

నాగార్జున- ప్రవీణ్ సత్తారు సినిమాలో మరో హీరోయిన్... టాలీవుడ్‏కు ఎంట్రీ ఇవ్వనున్న బాలీవుడ్ బ్యూటీ..
Gul Panag
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 10, 2021 | 8:16 PM

ప్రస్తుతం బాలీవుడ్ భామల చూపు మొత్తం తెలుగు ఇండస్ట్రీపై పడిందనే చెప్పుకోవాలి. ఇప్పటికే అలియా భట్, దీపిక పదుకునే తెలుగులో పగా వేసేందుకు సిద్ధమయ్యారు. ఇక మరో బ్యూటీ దియా మీర్జా ఇటీవల నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన వైల్డ్ డాగ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ ఆశించినంత హిట్ అవ్వకపోయినా.. దియా మీర్జా మాత్రం తన నటనతో విమర్శకులు ప్రశంసలు అందుకుంది. తాజాగా మరో బాలీవుడ్ అందాల తార.. తెలుగు తెరకు పరిచయం కాబోతున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం నాగార్జున.. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఇందులో నాగ్..  రా ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు.  కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఈ మూవీ షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ఈ సినిమాలో నాగ్ యంగ్ లుక్‏లో కనిపించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కాజల్‏తో పాటు మరో హీరోయిన్‏గా గుల్ పనాగ్ నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. రా ఏజెంట్ టీమ్ మెంబర్‏గా గుల్ పనాగ్ కనిపించనున్నట్లుగా టాక్. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో అజిత్ రీల్ కూతురు అనిఖా కీలక పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ తర్వాత నాగ్… కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగర్రాజు సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో నాగ చైతన్య కూడా కనిపించనున్నారని టాక్.

Also Read: Sameera Reddy: బరువు 92 కిలోలు.. అయినా సంతోషంలో మునిగితేలుతున్న హీరోయిన్.. కారణం తెలిస్తే షాకవుతారు..

Love You Racchu Movie: షూటింగ్‏లో కరెంట్ షాక్‏.. చిత్రయూనిట్ నిర్లక్ష్యంతో ఫైటర్ మృతి.. స్పందించిన ముఖ్యమంత్రి..

RRR Movie: ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. రామరాజు ఫ్యాన్స్‏కు జక్కన్న స్పెషల్ ట్రీట్..

Govinda: చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న బాలీవుడ్ గోవిందుడు.. సతీమణితో కలిసి ప్రత్యేక పూజలు..