RRR Movie: ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రామరాజు ఫ్యాన్స్‌కు జక్కన్న స్పెషల్ ట్రీట్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ మూవీ కోసం చెర్రీ, తారక్ అభిమానులు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ మూవీ కోసం చెర్రీ, తారక్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇద్దరు బడా హీరోలతో జక్కన్న చేయబోయే మ్యాజిక్‌ను చూసేందుకు తెలుగు ప్రేక్షకులు గత కొంతకాలంగా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాపై మొదటి నుంచి భారీ హైప్ క్రియేట్ చేస్తూ వస్తున్న జక్కన్న అందుకు తగ్గట్టుగానే పోస్టర్స్, ఇంట్రడ్యూస్ వీడియోస్ రివీల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో చివరి షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమా.. ఈనెల చివరలో ముగింపు పలకనున్నట్లుగా సమాచారం. అయితే ఇటీవల స్నేహితుల దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన దోస్తీ పాటకు రెస్పాన్స్ ఎక్కువగానే వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది.
ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ ఉక్రెయిన్ షూట్ పూర్తైన తర్వాత ఇండియాకు వచ్చిన వెంటనే ఫ్యాన్స్‌కు మరో స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నారట. ఈ సినిమా నుంచి రెండవ పాటను విడుదల చేయబోతున్నట్లుగా ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ పాటలో ఇద్దరు హీరోలు కనిపించరని.. కేవలం రామరాజు, అలియా మధ్య ఉండే పాట మాత్రమే అని సమాచారం. ఇక ఆ తర్వాత తారక్ పై ఉండే పాటను విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే సినిమా విడుదల సమయంలో ఇద్దరు స్టార్ హీరోలపై ఉండే పాటను రివీల్ చేయాలని భావిస్తున్నాడట జక్కన్న. ఇదిలా ఉంటే.. ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ను ఇక పై ఎన్టీఆర్ ఇవ్వబోతున్నట్లుగా ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read: MAA Elections 2021: నటి హేమకు ‘మా’ షాక్.. ఆ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు..
samuthirakani: సముద్రఖని డిమాండ్ మాములుగా లేదుగా.. నిర్మాతలకు షాకిస్తున్న విలన్..