Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

samuthirakani: సముద్రఖని డిమాండ్ మాములుగా లేదుగా.. నిర్మాతలకు షాకిస్తున్న విలన్..

ప్రస్తుతం టాలీవుడ్‎లో పరభాష నటీనటుల హవా నడుస్తోంది. హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్, విలన్ పాత్రలకు తమిళ్, కన్నడ, మలయాళ

samuthirakani: సముద్రఖని డిమాండ్ మాములుగా లేదుగా.. నిర్మాతలకు షాకిస్తున్న విలన్..
Samuthirakani
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 10, 2021 | 5:58 PM

ప్రస్తుతం టాలీవుడ్‎లో పరభాష నటీనటుల హవా నడుస్తోంది. హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్, విలన్ పాత్రలకు తమిళ్, కన్నడ, మలయాళ నటీనటులే ఎక్కువగా నటిస్తున్నారు. అయితే గతంలో విలన్ పాత్రలు చేయాలంటే బాలీవుడ్ నటులకు డిమాండ్ ఎక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం తమిళ నటులను విలన్స్‏గా తీసుకునేందుకు టాలీవుడ్ దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే విలన్ పాత్రలో వరలక్ష్మి, విజయ్ సేతుపతి, సముద్రఖని, అరవింద్ స్వామి వంటి వారు అదరగొట్టిన సంగతి తెలిసిందే. హీరోతో సరిసమానంగా వీరికి తెలుగు ప్రేక్షకులను నుంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో వీరికి తెలుగులో వరుస ఆఫర్లు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు నటుడు సముద్రఖని.

కోలీవుడ్‏లో దర్శకుడిగా, రచయితగా.. నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పరిచయమయ్యారు సముద్రఖని. అందులో తండ్రి పాత్రలో సహజ నటనతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన అల వెైకుంఠపురంలో ఆయన పోషించిన అప్పలనాయుడు పాత్రకు విశేష స్పందన లభించింది. ఈ సినిమాతో సముద్రఖని పాత్రకు క్రేజ్ ఏర్పడింది. ఇక ఇటీవల మాస్ మాహారాజా హీరోగా నటించిన క్రాక్ చిత్రంలోని సముద్రఖని నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం సముద్రఖని.. జక్కన్న తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. రానా దగ్గుబాటి సోదరుడు అభిరామ్ హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు తేజా డైరెక్షన్‏లో అభిరామ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో కీలక పాత్ర కోసం సముద్రఖనిని తీసుకోవాలనుకుంటున్నట్లుగా టాక్ వినిపించింది. అయితే ఇప్పటి వరకు ఆ పాత్ర కోసం సముద్రఖని ఖారారు కాలేదట. ఇందుకు కారణం ఆయనకు ఇచ్చే పారితోషికం విషయంలో సురేష్ బాబు నిరాశగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగులో ఆయనకు విపరీతమైన డిమాండ్ ఉండడంతో రెమ్యూనరేషన్ కూడా భారీగా ఇవ్వాల్సి వస్తుండడంతో సురేష్ బాబు ఒప్పుకోవడం లేదని.. కానీ డైరెక్టర్ తేజ ఇందుకు ప్రయత్నిస్తు్న్నట్లుగా ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది.

Also Read: MAA Elections 2021: నటి హేమకు ‘మా’ షాక్.. ఆ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు..

Govinda: చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న బాలీవుడ్ గోవిందుడు.. సతీమణితో కలిసి ప్రత్యేక పూజలు..

Saranya Sasi: ఇండస్ట్రీలో మరో విషాదం.. పదేళ్లుగా క్యాన్సర్‏తో పోరాటం.. కరోనా కాటుకు బలి.. నటి శరణ్య కన్నుమూత..