- Telugu News Photo Gallery Cinema photos Actor govinda visited hyderabad charminar bhagyalakshmi temple with his family
Govinda: చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న బాలీవుడ్ గోవిందుడు.. సతీమణితో కలిసి ప్రత్యేక పూజలు..
బాలీవుడ్ నటుడు గోవిందా సతీ సమేతంగా హైదరాబాద్లోని చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గోవిందా, భార్య సునీత తో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Updated on: Aug 10, 2021 | 4:58 PM

చారిత్రాత్మక చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని దర్శించుకున్న అనంతరం గోవిందా దంపతులు మహా హారతిలో పాల్గొన్నారు. ఆ తర్వాత గోవిందా దంపతులను ఆలయ ట్రస్టీ చైర్మన్ శశికళ శాలువతో ఘనంగా సత్కరించారు .

ఈ సందర్భంగా నటుడు గోవిందా మాట్లాడుతూ.. ముందుగా సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకె గౌరీ నారాయణీ నమోస్తుతే... మాతృదేవో భవ శ్లోకాన్ని పఠించాడు.

అమ్మవారి ఆశీర్వాదంతో నేను సంతోషంగా ఉన్నామని.. తన భార్య సునీతతో కలిసి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాలనుకున్నట్లు తెలిపారు.

ఆ భాగ్యం ఇన్నాళ్లకు వచ్చిందన్నారు. తన అమ్మ నమ్లా దేవి గాయత్రీ దేవి ఉపాసన తీసుకుందని, తన అత్తయ్య సావిత్రీ కూడా మరో అమ్మవారి రూపంలో వచ్చిందని ఇద్దరు అమ్మలకు సేవ చేసుకునే భాగ్యం కలిగిందని సంతోషం వ్యక్తం చేశారు.

ఈశ్వరుని దయతో కీర్తి ప్రతిష్టలు, సంపద అన్నీ లభింంచాయని.. జీవితంలో ఇంకా ఎలాంటి దుఃఖాలు, నష్టాలు, కష్టాలు రాకుండా చూడాలని అమ్మవారిని వెడుకున్నట్టు చెప్పారు. హైదరాబాద్ గడ్డపై ఎన్నో హిట్ సినిమాలు తనకు కెరీర్లో వచ్చాయని.. ఇక్కడికి తన భార్యతో కలిసి రావడం సంతోషంగా ఉందన్నారు. (రిపోర్టర్ నూర్ మొహమ్మద్ హైదరాబాద్..)




