Sameera Reddy: బరువు 92 కిలోలు.. అయినా సంతోషంలో మునిగితేలుతున్న హీరోయిన్.. కారణం తెలిస్తే షాకవుతారు..

సమీరా రెడ్డి.. తెలుగు ప్రేక్షకులు పరిచయమున్న పేరు. చిరంజీవి, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించి టాలీవుడ్‏లో

Sameera Reddy: బరువు 92 కిలోలు.. అయినా సంతోషంలో మునిగితేలుతున్న హీరోయిన్.. కారణం తెలిస్తే షాకవుతారు..
Sameera Reddy
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 10, 2021 | 7:44 PM

సమీరా రెడ్డి.. తెలుగు ప్రేక్షకులు పరిచయమున్న పేరు. చిరంజీవి, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించి టాలీవుడ్‏లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సమీరా. కేవలం తెలుగులోనే కాకుండా.. బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్‏లో పలు చిత్రాల్లో నటించింది సమీరా. అయితే కెరీర్ ఫుల్ ఫాంలో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు స్వస్తీ చెప్పింది. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ సమయంలో అధికంగా బరువు పెరిగారు. దీంతో చాలా బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొన్నానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తాజాగా తన వెయిట్ లాస్ ప్రయాణం గురించి స్పందించారు. బరువు తగ్గేందుకు వర్కవుట్స్ చేయడం ప్రారంభించడానికి ముందుకు.. అలాగే ప్రస్తుత బరువుపై తను సంతృప్తిగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.

తన కుమారుడు హాన్స్‏తో ఉన్న ఫోటోను తన ఇన్‏స్టా ఖాతాలో షేర్ చేస్తూ తన వెయిట్ లాస్ గురించి చెప్పుకొచ్చారు. మీరు ఇష్టపడే వ్యక్తులను మరియు వస్తువులను ఆస్వాదించలేని స్థితికి ప్రతికూలత లేదా తీర్పు మిమ్మల్ని తిననివ్వవద్దు .. మనలో చాలా మంది ఆ తప్పు చేస్తారు. నేను గతంలో ఈ తప్పు చేశాను. కానీ ఇప్పుడు చేయకూడదు అనుకుంటున్నాను. ఈ ఫోటో జనవరి 2021లో తీసినది. అప్పుడు నేను 92 కిలోలు ఉన్నాను. కానీ ప్రస్తుతం 10 కేజీలు తక్కువగా ఉన్నాను. అందుకు సంతోషంగా ఉంది. ఎప్పుడైన , ఏ వయసులోనైనా మీ ముఖం అసభ్యంగా, అంసపూర్ణంగా ఉన్నా మీతో మీరు కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. బాడీ పాజిటివిటి అంటే ఇదే అంటూ ట్వీట్ చేసింది. బరువు తగ్గడంలో తనకు సపోర్ట్ ఇచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ గతంలో ఓ వీడియో షేర్ చేసింది సమీరా.

ట్వీట్..

Also Reddy: Love You Racchu Movie: షూటింగ్‏లో కరెంట్ షాక్‏.. చిత్రయూనిట్ నిర్లక్ష్యంతో ఫైటర్ మృతి.. స్పందించిన ముఖ్యమంత్రి..

RRR Movie: ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. రామరాజు ఫ్యాన్స్‏కు జక్కన్న స్పెషల్ ట్రీట్..

samuthirakani: సముద్రఖని డిమాండ్ మాములుగా లేదుగా.. నిర్మాతలకు షాకిస్తున్న విలన్..