Love You Racchu Movie: షూటింగ్లో కరెంట్ షాక్.. చిత్రయూనిట్ నిర్లక్ష్యంతో ఫైటర్ మృతి.. స్పందించిన ముఖ్యమంత్రి..
సినిమా చిత్రీకరణ సమయంలో మూవీ యూనిట్ ఎంతో జాగ్రత్తగా ఉంటారు. అయినా కానీ కొన్ని సందర్భాల్లో అనుకోకుండా
సినిమా చిత్రీకరణ సమయంలో మూవీ యూనిట్ ఎంతో జాగ్రత్తగా ఉంటారు. అయినా కానీ కొన్ని సందర్భాల్లో అనుకోకుండా జరిగే ప్రమదాలు, ఆస్తి నష్టంతోపాటు.. ప్రాణ నష్టాన్ని కలిగిస్తుంటారు. గతంలో పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్.. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం గురించి తెలిసిందే. ఇందులో ఇద్దరు సినీ కార్మికులు మరణించగా.. భారీగా ఆస్తి నష్టం జరిగింది. తాజాగా సోమవారం కన్నడ చిత్రపరిశ్రమలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. అజయ్ రావు హీరోగా తెరెకెక్కుతున్న లవ్ యు రచ్చు సినిమా షూటింగ్ సోమవారం.. రామనగర్‌లో జోగనోదొడ్డి సమీపంలో జరగింది. అయితే చిత్రీకరణ జరుగుతుండగా.. విద్యుదాఘాతంతో ఫైటర్ మరణించాడు.
అజయ్ రావు, రచిత రామ్ ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ శంకర్ రాజ్ తెరకెక్కి్స్తున్న సినిమా లవ్ యూ రచ్చు. ఈ సినిమాలోని యాక్షన్ సిక్వెన్స్ చేస్తున్న సమయంలో ఫైటర్ వివేక్ (35) విద్యుదాఘాతంతో మరణించాడు. అయితే చిత్రయూనిట్ నిర్లక్ష్యం వల్లే వివేక్ మరణించడాని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈక్రమంలో దర్శకుడు శంకర్ స్టంట్ కొరియోగ్రాఫర్ వినోద్, క్రేన్ డ్రైవర్ మునిరాజు, వ్యవసాయ యజమాని పుట్టరాజులను రమణగార పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక ఫైటర్స్, ఫైట్ మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడైన వినోద్.. చిత్రబృందం లోకేషన్లో షూటింగ్ కోసం అనుమతి తీసుకోలేదని పోలీసులు తెలిపారు. దీంతో కన్నడ చిత్రపరిశ్రమలో జరుగుతున్న లోపాలు, భద్రత ప్రమాణాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చిత్రయూనిట్, దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని వివేక్ కుటుంబసభ్యులు, స్నేహితులు డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. షూటింగ్‌లకు సంబంధించిన కొన్ని నిబంధనలను ప్రభుత్వం త్వరలో జారీ చేస్తుందని చెప్పారు.
samuthirakani: సముద్రఖని డిమాండ్ మాములుగా లేదుగా.. నిర్మాతలకు షాకిస్తున్న విలన్..
MAA Elections 2021: నటి హేమకు ‘మా’ షాక్.. ఆ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు..