AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandini Chowdary: తీవ్రంగా గాయపడ్డ హీరోయిన్.. కీలక నిర్ణయం తీసుకున్న చాందిని చౌదరి..

టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ నటించిన కలర్ ఫోటో సినిమాతో సూపర్ హిట్ అందుకుంది చాందిని చౌదరి. ఈ మూవీ తర్వాత ఆమెకు తెలుగులో ఆఫర్స్ క్యూ కట్టాయి. ఈ ఏడాది బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ. కానీ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ ఉండడం లేదు. ఇందుకు గల కారణాలను వెల్లడించింది చాందిని.

Chandini Chowdary: తీవ్రంగా గాయపడ్డ హీరోయిన్.. కీలక నిర్ణయం తీసుకున్న చాందిని చౌదరి..
Chandini Chowdary News
Rajitha Chanti
|

Updated on: Nov 05, 2024 | 3:11 PM

Share

నటనపై ఆసక్తితో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టిన తెలుగమ్మాయి చాందిని చౌదరి. కుందనపు బొమ్మ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన చాందిని.. ఆ తర్వాత వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ ఇండస్ట్రీలో బిజీగా మారింది. హీరోయిన్ గా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కలర్ ఫోటో సినిమా ద్వారా నటిగా ప్రశంసలు అందుకుంది చాందిని. ఆ తర్వాత విశ్వక్ సేన్ హీరోగా నటించిన గామి సినిమాతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత మ్యూజికల్ షాప్ మూర్తి, ఏవమ్ చిత్రాలతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించింది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా గడిపిన చాందిని.. కొన్ని రోజులుగా సైలెంట్ అయ్యింది. అటు సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టివ్ గా కనిపించడం లేదు. తాజాగా తన సోషల్ మీడియోలో చాందిని చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న చాందిని గాయం అయినట్లుగా తెలుస్తోంది.

“హాల్లో గాయ్స్.. నేను గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు. ఎందుకంటే కొన్ని నెలల క్రితం గాయమైంది. నేను దాని తీవ్రతను అర్థం చేసుకోలేక షూటింగ్స్ లో పాల్గొన్నాను. ఇప్పుడు ఆ గాయం మరింత పెద్దదిగా మారింది. నేను నా షూటింగ్స్ కోసం వెళ్తుంటే ఆ గాయం మరింతగా నన్ను బాధించడం ప్రారంబించింది. దీంతో నేను ఇప్పుడు అన్నింటికి దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యాను. మళ్లీ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత సోషల్ మీడియాకు తిరిగి వస్తాను” అంటూ తన ఇన్ స్టాలో ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం చాందిని చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో ఆమెను జాగ్రత్తలు చెబుతున్నారు నెటిజన్స్.

Chandini Chowdary

Chandini Chowdary

ఇదిలా ఉంటే.. ఈ ఏడాది బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో సక్సెస్ అందుకుంది చాందిని చౌదరి. మ్యూజిక్ షాప్ మూర్తి, ఏవమ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన చాందిని.. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న ఓ ప్రాజెక్టులో చాందిని కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆమె లుక్ విడుదల చేయగా.. మంచి స్పందన వచ్చింది.

ఇది చదవండి : Tollywood : అదృష్టం కలిసిరాని అందాల రాశి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా.. ?

Dandupalyam Movie: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. దండుపాళ్యం హీరోయిన్‏ను చూస్తే షాకవ్వాల్సిందే..

Tollywood: నిర్మాతలు డబ్బులు ఇవ్వలేదు.. ఎన్నో ఇబ్బందులు పడిన హీరోయిన్.. చివరకు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us