AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatesh: వెంకటేష్ మా ఇంట్లోనే డ్యాన్స్ నేర్చుకున్నారు.. కట్ చేస్తే.. ఆయనతో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా చేశా.. హీరోయిన్..

టాలీవుడ్ హీరోయిన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. విక్టరీ వెంకటేష తమ ఇంట్లోనే డ్యాన్స్ నేర్చుకున్నారని.. ఆ తర్వాత ఆయనతో కలిసి తాను చేసిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందామా.

Venkatesh: వెంకటేష్ మా ఇంట్లోనే డ్యాన్స్ నేర్చుకున్నారు.. కట్ చేస్తే.. ఆయనతో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా చేశా.. హీరోయిన్..
Venkatesh
Rajitha Chanti
|

Updated on: May 14, 2026 | 8:29 PM

Share

సీనియర్ నటి భానుప్రియ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, డ్యాన్స్ పట్ల ఆమెకున్న అంకితభావం గురించి వివరించారు. ఆమె తాను క్లాసికల్ డాన్సులతో పాటు రాప్, ట్యాప్, డిస్కో వంటి డ్యాన్సులలో సైతం అంతే ఎనర్జీతో చేశానని తెలిపారు. చిరంజీవితో డ్యాన్స్ చేసేటప్పుడు అద్భుతమైన ఎనర్జీ ఉంటుందని, అది ఒక లైఫ్ అని చెప్పారు. అయితే, చిరంజీవి పలు సందర్భాలలో తనకి ఉత్తమ డ్యాన్స్ పెయిర్‌లలో రాధిక, రాధ, భానుప్రియల పేర్లను చెప్పినప్పటికీ, భానుప్రియ ఒక కాంపిటీటర్‌లా డ్యాన్స్ చేస్తుందని, సాంకేతిక అంశాలపై ఎక్కువ దృష్టి పెడుతుందని చెప్పారని ఆమె గుర్తుచేసుకున్నారు. తాను క్లాసికల్ డాన్స్ శిక్షణలో నేర్చుకున్న పరిపూర్ణత తపన తప్ప, ఎవరితోనూ పోటీ పడాలనే ఉద్దేశ్యం లేదని వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

దర్శకుడు బాపుతో కలిసి పని చేయలేకపోవడం పట్ల భానుప్రియ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కళాత్మక దృష్టిని, అందమైన కళ్ళ కోసం ఆయన అన్వేషణను ఎంతగానో మెచ్చుకున్నారు. బాపు చిత్రాలలో హీరోయిన్‌లను సాంప్రదాయబద్ధంగా, అందంగా చూపించే తీరు తనకు చాలా ఇష్టమని, ముత్యాల ముగ్గు వంటి సినిమాలు తనకు ఎంతగానో నచ్చాయని చెప్పారు. ఆయనతో అవకాశం కోసం ఎన్నో ఏళ్లు ఎదురు చూసినా, ఎప్పుడూ కలవలేదని, అది తన రాతలో లేదని భానుప్రియ ఆవేదనగా వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వర్ణకమలం చిత్రం తన కెరీర్‌లో ఒక మైలురాయి అని భానుప్రియ పేర్కొన్నారు. ఆ సినిమా విడుదలైన తర్వాత అద్భుతమైన ప్రశంసలు అందుకున్నానని, విశ్వనాథ్ తనను చాలా మెచ్చుకున్నారని తెలిపారు. ఆయన “భానుప్రియ తప్ప ఇంకెవరూ ఆ పాత్ర చేయలేకపోయేవారు” అని అన్నారని గుర్తుచేసుకున్నారు. వెంకటేష్ కూడా ఒక ఇంటర్వ్యూలో స్వర్ణకమలంలో భానుప్రియ డ్యాన్స్ గురించి చెప్పుకొచ్చారు.. ఒక సన్నివేశంలో ఒక హీరోయిన్‌ను అంతసేపు తదేకంగా చూడటం తన జీవితంలో అదే మొదటిసారి అని, ఆమె అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారని వెంకటేష్ చెప్పినట్లు భానుప్రియ గుర్తుచేసుకున్నారు. వెంకటేష్ తన అత్తయ్య సుమతి కౌశల్ వద్ద డ్యాన్స్ నేర్చుకున్నారని, వారు ఇప్పటికీ పరిచయాలు ఉన్నాయని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

Bhanupriya

Bhanupriya

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..

Follow Us