Archana Kottige: పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఐపీఎల్ క్రికెటర్‌తో వివాహ బంధంలోకి..
సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్స్ ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. గతేడాది కీర్తి సురేష్, శోభితా ధూళిపాళ్ల వంటి అగ్రకథానాయికలు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ ఏడాదిలో మరో హీరోయిన్ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేసింది. తాజాగా తన ప్రియుడిని పెళ్లి చేసుకుంది.

ఇప్పుడిప్పుడే కన్నడ సినీరంగంలో కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంటున్నవారిలో అర్చన కొట్టిగె ఒకరు. కన్నడలో పలు చిత్రాల్లో నటించి ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తాజాగా తన ప్రియుడు శరత్ అనే క్రికెటర్ ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఆర్సీబీ ప్లేయర్ దేవదత్ పడిక్కల్, ప్రసిద్ధ్ కృష్ణతోసహా అనేక మంది క్రికెటర్స్, సినీ స్టార్స్ హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇప్పుడు ఈ కొత్త జంటకు నెటిజన్స్ విషెస్ తెలియజేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఇద్దరు కుటుంబసభ్యుల సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్థం చేసుకున్నారు.
కన్నడ చిత్రపరిశ్రమలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అర్చన. 2018లో అరణ్యకాండ సినిమాతో సినీరంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘వాసు నాన్ పక్కా కమర్షియల్’, ‘డియర్ సత్య’, ‘ట్రిపుల్ రైడింగ్’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ సంవత్సరం విడుదలైన కన్నడ చిత్రం ‘ఫారెస్ట్’లో అర్చన నటించింది. ఇందులో మీనాక్షి పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది.
ఇక శరత్ క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే 2024లో గుజరాత్ టైటన్స్ తరపున ఆడాడు. ఇది అతని మొదటి IPL సీజన్. ఈ సంవత్సరం అతను ఏ ఫ్రాంచైజీతోనూ గుర్తింపు పొందలేదు. కొన్నాళ్లుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారు. అంతకుముందు ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నారు. శరత్ అర్చనకు సీనియర్.
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..
