Anushka Shetty: సన్నజాజి తీగల ఉండే దేవసేన.. మరీ ఇలా మారిపోయిందేంటీ ?.. షాకిస్తున్న అనుష్క లేటేస్ట్ లుక్..
ఆమె నుంచి ఇప్పుడు ఎలాంటి ప్రాజెక్ట్స్ అనౌన్స్మెంట్ కాలేదు. అంతేకాదు.. అటు సోషల్ మీడియాలోనూ సైలెంట్ గా ఉంటుంది
టాలీవుడ్ చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది అనుష్క శెట్టి. సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన స్వీటీ.. అరుంధతి సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఈ సినిమాతో అనుష్క క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో తెలుగు వరుస అవకాశాలు ఆమె వద్దకు క్యూకట్టాయి. అగ్రహీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో దేవసేన పాత్రలో అద్భుతంగా నటించింది అనుష్క. ఈ సినిమా తర్వాత ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఆమె నుంచి ఇప్పుడు ఎలాంటి ప్రాజెక్ట్స్ అనౌన్స్మెంట్ కాలేదు. అంతేకాదు.. అటు సోషల్ మీడియాలోనూ సైలెంట్ గా ఉంటుంది స్వీటీ. బాహుబలి హిట్ తర్వాత అనుష్కకు మరిన్ని ఆఫర్స్ వస్తాయనుకుంటే చాలా రోజులుగా ఆమె ఇండస్ట్రీకే దూరంగా ఉంటున్నారు.
ఇటీవలే నవీన్ పోలిశెట్టి సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యింది అనుష్క. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా నుంచి విడుదలైన అనుష్క ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. అయితే కొన్నాళ్లుగా బయట ఎక్కడా కనిపించని అనుష్క.. తాజాగా తన ఫ్యామిలీతో కలిసి బెంగుళూరులోని శివరాత్రి వేడుకలకు హాజరైంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు తెగ వైరలవుతున్నాయి.
దాదాపు రెండేళ్ల తర్వాత అనుష్క బయట కనిపించడంతో ఆమె ఫోటోస్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇందులో అనుష్క లుక్ చూసి షాకవుతున్నారు అభిమానులు. అందులో అనుష్క కాస్త బొద్దుగా కనిపిస్తున్నారు. ఇటీవల విడుదలైన మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమా ఫస్ట్ లుక్ లో సన్నజాజి తీగల కనిపించిన అనుష్క.. ఇప్పుడు ఇలా బొద్దుగా కనిపించడంతో ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.