Amala Paul: ‘మట్టిని కలిపి కలలు రూపుదిద్దుకుంటున్నాయి’.. అమలా పాల్లో ఈ టాలెంట్ సైతం ఉందా ?..
తమిళ్ స్టార్ ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్, వీఐపీ చిత్రాలతో అటు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత పెళ్లి, విడాకుల విషయంలో నిత్యం వార్తలలో నిలిచిన ఈ బ్యూటీ.. ఆమె అనే సినిమాలో న్యూడ్ గా నటించి ఒక్కసారిగా అందరిని షాక్ కు గురి చేసింది. కానీ అందులో అమలా నటనకు మంచి మార్కులే పడ్డాయి. చాలా కాలంగా అమలాకు అవకాశాలు రావడం లేదు. దీంతో వెండితెరపై ఈ బ్యూటీ జోరు తగ్గింది.
తెలుగు సినీ ప్రియులకు హీరోయిన్ అమలా పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కేరళ కుట్టి ఆ తర్వాత ఇద్దరమ్మాయిలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత తమిళం, కన్నడలో పలు చిత్రాలు చేసిన ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో మాత్రం స్టార్ డమ్ రాలేదు. కానీ తమిళ్ స్టార్ ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్, వీఐపీ చిత్రాలతో అటు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత పెళ్లి, విడాకుల విషయంలో నిత్యం వార్తలలో నిలిచిన ఈ బ్యూటీ.. ఆమె అనే సినిమాలో న్యూడ్ గా నటించి ఒక్కసారిగా అందరిని షాక్ కు గురి చేసింది. కానీ అందులో అమలా నటనకు మంచి మార్కులే పడ్డాయి. చాలా కాలంగా అమలాకు అవకాశాలు రావడం లేదు. దీంతో వెండితెరపై ఈ బ్యూటీ జోరు తగ్గింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం అమలా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల మాల్దీవ్స్‌లో బీచ్ ఒడ్డున ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఒక క్రేజీ వీడియో షేర్ చేసింది. అమలా షేర్ చేసిన వీడియోలో పూర్తిగా న్యాచురల్ లుక్‌లో ఈ కేరళ కుట్టి మట్టి సహాయంతో కుండలు తయారు చేస్తూ సరదాగా గడుపుతుంది. తెల్లటి దుస్తులను ధరించి మరింత అందంగా కనిపిస్తోంది. “మట్టిని మలిచి కలలు రూపుదిద్దుకుంటున్నాయి ” అంటూ రాసుకొచ్చింది అమలా. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. ఇక ఆ వీడియో చూసిన నెటిజన్స్ అమలాలో ఈ టాలెంట్ కూడా ఉందా ? అని.. నేచురల్ లుక్‌లో మరింత అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ అమలాలో ఉన్న మరో టాలెంట్ ఏంటంటే.. మట్టి పాత్రలు తయారు చేయడం.
View this post on Instagram
ఇక అమలా సినిమాల విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం ఆడు జీవితం చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాకు బ్లెస్సీ దర్శకత్వం వహిస్తుండగా.. అక్టోబర్ 20న విడుదల కానుంది. బెన్యామిన్ రాసిన బెస్ట్ సెల్లింగ్ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. డబ్బు సంపాదించడానికి అరేబియాకు వెళ్లిన నజీబ్ ముహమ్మద్ అనే భారతీయ వలస కార్మికుడి నిజ జీవితం సంఘటనల చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. అతనికి ఎడారిలో మేకలను మేపే పని అప్పగించగా.. అతను ఆ వలస జీవితం నుంచి ఎలా బయటపడ్డాడు అనేది ఆడు జీవితం.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.