Allu Arjun: అల్లు అర్జున్‏కు స్పెషల్ విషెస్ చెప్పిన రామ్ చరణ్.. బన్నీ రిప్లై ఏంటంటే..

ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఇప్పటివరకు ఏ తెలుగు నటుడు అందుకోని బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకున్నారు బన్నీ. ఇక ఈసారి నేషనల్ అవార్డులలో ఎక్కువగా మెగా హీరోలు నటించిన సినిమాలకే ఈ అవార్డ్స్ రావడం విశేషం. బన్నీకి జాతీయ ఉత్తమ నటుడిగా రావడంతో మెగా ఫ్యామిలీ ఫుల్ సంతోషంలో ఉంది. వెంటనే చిరు సోషల్ మీడియా వేదికగా బన్నీకి స్పెషల్ విషెస్ తెలుపగా.. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ బన్నీ ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు తెలిపారు.

Allu Arjun: అల్లు అర్జున్‏కు స్పెషల్ విషెస్ చెప్పిన రామ్ చరణ్.. బన్నీ రిప్లై ఏంటంటే..
Allu Arjun, Ram Charan
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 25, 2023 | 3:42 PM

69వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు చిత్రపరిశ్రమ సత్తా చాటింది. 2021 ఏడాదిగానూ గురువారం సాయంత్రం ప్రకటించిన నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‏లో తెలుగు సినిమాలకు అవార్డ్స్ దక్కాయి. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఏకంగా ఆర్ఆర్ఆర్ అవార్డ్స్ రాగా.. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప చిత్రానికి రెండు అవార్డ్స్ వచ్చాయి. ఇక తొలి సినిమాతోనే నేషనల్ అవార్డ్ అందుకున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు సన. ఆయన రూపొందించిన ఉప్పెన సినిమా ఉత్తమ చిత్రంగా ఎంపికైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఇప్పటివరకు ఏ తెలుగు నటుడు అందుకోని బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకున్నారు బన్నీ. ఇక ఈసారి నేషనల్ అవార్డులలో ఎక్కువగా మెగా హీరోలు నటించిన సినిమాలకే ఈ అవార్డ్స్ రావడం విశేషం. బన్నీకి జాతీయ ఉత్తమ నటుడిగా రావడంతో మెగా ఫ్యామిలీ ఫుల్ సంతోషంలో ఉంది. వెంటనే చిరు సోషల్ మీడియా వేదికగా బన్నీకి స్పెషల్ విషెస్ తెలుపగా.. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ బన్నీ ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు తెలిపారు.

అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాస్త ఆలస్యంగా స్పందించారు. శుక్రవారం తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ తోపాటు.. పుష్ప, కొండపొలం, ఉప్పెన, అలియా భట్ లకు అభినందనలు తెలిపారు. “ఇది నేను ఎంతగానో గర్వించే క్షణాలు.. నా బంధుమిత్రులు, స్నేహితులు, సన్నిహితులే అవార్డులను అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ టీం, విజనరీ డైరెక్టర్ రాజమౌళి గారికి కంగ్రాట్స్. ఆరు అవార్డ్స్ వచ్చాయి. ఎంఎం కీరవాణి గారు.. ప్రేమ్ రక్షిత్, కాళభైరవ, శ్రీనివాస్ మోహన్, కింగ్ సోలోమన్, డీవీవీ ఎంటర్టైన్మెంట్, డీవీవీ దానయ్య గారు. ఇది నాకు ఎంతో మెమోరబుల్ జర్నీ” అంటూ చెప్పుకొచ్చాడు.

ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్‏కు.. పుష్ప టీంతోపాటు బన్నీకి, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సన, కొండపొలం మూవీటీంతోపాటు.. గంగూబాయి కతియవాడి సినిమాగానూ ఉత్తమ నటిగా ఎంపికైన అలియాకు అభినందనలు తెలియజేశారు రామ్ చరణ్. మెగా పవర్ స్టార్ స్పెషల్ నోట్ చూసేయ్యండి.

మరోవైపు బన్నీ ఇంట్లో సంబరాలు అంబరాన్నంటాయి. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ వచ్చినందుకు బన్నీ కొన్ని క్షణాలపాటు షాక్ లో ఉండిపోయారు. ఆ తర్వాత తన తండ్రిని హత్తుకున్నారు. వెంటనే ఆయన పాదాలకు నమస్కరించారు. ఆ తర్వాత సంతోషంతో తన భార్య, పిల్లలను హత్తుకున్నారు. ఇక బన్నీ ఇంటికి చేరుకున్న సుకుమార్ భావోద్వేగానికి గురయ్యారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.