AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: అల్లు అర్జున్ రాకా సినిమాలో ఛాన్స్ ఇప్పించండి.. హీరోయిన్ రిక్వెస్ట్

భారతీయ చిత్ర పరిశ్రమకు ఇప్పుడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ కంటే దక్షిణాది చిత్రాలు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఎక్కువ ప్రజాదరణ పొందుతున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి ఎన్నో తెలుగు సినిమాలు వరల్డ్ బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులను అలరించి భారీ కలెక్షన్లు రాబట్టాయి.

Allu Arjun: అల్లు అర్జున్ రాకా సినిమాలో ఛాన్స్ ఇప్పించండి.. హీరోయిన్ రిక్వెస్ట్
Allu Arjun
Rajeev Rayala
|

Updated on: Oct 03, 2026 | 1:20 PM

Share

అల్లు అర్జున్‌ అభిమానులతో పాటు ఇండియన్ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ‘రాకా’ ఒకటి. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రానికి సంబంధించి తరచూ కొత్త కొత్త వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా సినిమాలో నటించబోయే హీరోయిన్ల విషయంలో అనేక పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో చాలా మంది హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇటీవల మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి కూడా ‘రాకా’లో నటిస్తున్నారని ప్రచారం జోరుగా సాగింది. అంతేకాదు, ఆమె సినిమాలో కీలకమైన నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించనున్నారంటూ రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా ఐశ్వర్య లక్ష్మి స్వయంగా స్పందించడంతో క్లారిటీ వచ్చేసింది. రాకాలో తాను నటిస్తున్నానంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఐశ్వర్య లక్ష్మి క్లారిటీ ఇచ్చేసింది. సోషల్‌ మీడియాలో వచ్చిన ఆ వార్తలను చూసి తాను కూడా నవ్వుకున్నానని ఆమె సరదాగా పేర్కొన్నారు.

300లకు పైగా సినిమాలు.. తొలి సినిమాకే రూ. 15 రెమ్యునరేషన్.. ఈ హీరోయిన్ రేంజే వేరు

అంతేకాదు.. తనను ‘రాకా’లో నటించమని ఎవరైనా అవకాశం ఇప్పించాలని సరదాగా కోరుకున్నట్లు ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. దీంతో ఇప్పటివరకు ఆమె గురించి వచ్చిన వార్తలన్నీ కేవలం ఊహాగానాలేనని క్లారిటీ వచ్చేసింది. అట్లీ, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’కు సంబంధించి మరో ఆసక్తికరమైన ప్రచారం కూడా చాలాకాలంగా వినిపిస్తోంది. ఈ సినిమాలో ఏకంగా నలుగురు కథానాయికలు ఉంటారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పలువురు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే రాకాలో అల్లు అర్జున్‌కు జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ దీపికా పదుకొణె నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇవి కూడా చదవండి

కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్స్ ఈ భామలు..! ఒకప్పుడు ఊపేశారు.. కానీ ఆతర్వాత సినిమాలు ఆపేశారు

మరోవైపు మలయాళ నటి ఫెమినా జార్జ్‌ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇక ‘రాకా’లో జాన్వీ కపూర్‌, రష్మిక మందన్న పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరి విషయంలో ఇప్పటివరకు మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. అందువల్ల ప్రస్తుతం వీరి పాత్రలపై వస్తున్న వార్తలను అధికారికంగా ప్రకటించలేదు. మొత్తానికి ‘రాకా’లో నటీనటుల ఎంపికపై వస్తున్న ఒక్కో వార్త ఆసక్తిని పెంచుతోంది. ఐశ్వర్య లక్ష్మి విషయంలో మాత్రం ఆమె స్వయంగా స్పందించడంతో ఆ ప్రచారానికి తెరపడింది. ఇక సినిమాలో మిగిలిన హీరోయిన్లుగా ఎవరెవరు కనిపించనున్నారనే విషయంపై మూవీ టీమ్ అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

ఫస్ట్ సినిమాకు రూ. 70లక్షలు అందుకుంది.. దెబ్బకు రెండు సినిమాలకే కనిపించకుండా పోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us