Fauzi: దుమ్మురేపుతున్న ప్రభాస్ ఫౌజీ గ్లింప్స్.. సుభాష్ చంద్రబోస్ పాత్రలో నటించింది ఎవరో తెలుసా.?
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’. తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ టైటిల్, గ్లింప్స్ , విడుదల తేదీని ప్రకటిస్తూ ఒక పవర్‌ఫుల్ వీడియోను విడుదల చేశారు.

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సాలార్ 2, కల్కి 2, ఫౌజీ, స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఫౌజీ’ చిత్ర గ్లింప్స్ (ఫైల్ నంబర్ 25) విడుదల చేశారు. 23న రాత్రి 9:30 గంటల ప్రాంతంలో విడుదల చేసిన ఈ రెండున్నర నిమిషాల గ్లింప్స్, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ గ్లింప్స్‌లో ప్రభాస్ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్లు ఒకెత్తయితే, వాటిని నేతాజీ సుభాష్ చంద్రబోస్ నోటి ద్వారా చెప్పించడం మరొక ఎత్తు. హిట్లర్, సుభాష్ చంద్రబోస్ ఇద్దరూ కలిసి ఒక భారతీయ గూఢచారి గురించి చర్చించుకోవడం, ఆ గూఢచారే మన ‘ఫౌజీ’ అని చూపించడం సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
గ్లింప్స్ ద్వారా దర్శకుడు కథ యొక్క నేపథ్యాన్ని చాలా ఆసక్తికరంగా పరిచయం చేశారు. గ్లింప్స్‌లోని హిట్లర్, సుభాష్ చంద్రబోస్ విజువల్స్ చాలా సహజంగా, అచ్చం నిజమైన నాయకుల్లా కనిపించడంతో చాలామంది ఇవి ఏఐ సాయంతో క్రియేట్ చేసిన పాత్రలని అనుకున్నారు. అయితే, ఇవి ఏఐ విజువల్స్ కావు, నిజమైన నటులే ఈ పాత్రల్లో జీవించారు. ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ పాత్రలో అచ్చుగుద్దినట్లు సరిపోయిన ఆ నటుడు ఎవరో తెలుసా.?
ఆయన మరాఠి నటుడు సుభోద్ బావే. మరాఠీ చిత్ర పరిశ్రమలో సుభోద్ బావేకు విశేషమైన గుర్తింపు ఉంది. ఆయన కేవలం నటుడే కాదు… రచయిత, దర్శకుడు మరియు నిర్మాత కూడా.. నాటకాల నుంచి సినిమాల వరకు 1990ల కాలంలో నాటక రంగంతో తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించిన సుభోద్, 2002 నుంచి మరాఠీ, హిందీ చిత్రాల్లో నటించడం మొదలుపెట్టారు. కొంకణీ, మలయాళ భాషల్లోనూ మంచి పాత్రలు పోషించారు. కత్యర్ ఖల్జత్ గుసాలీ అనే సూపర్ హిట్ సినిమాతో ఆయన దర్శకుడిగా మారారు మారారు. 2015లో వచ్చిన ‘లోక్‌మాన్య: ఏక్ యుగపురుష్’ చిత్రంలో స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర తిలక్ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ‘ఫౌజీ’ చిత్రంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్ర ద్వారా ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయ్యారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




