AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్స్ అరెస్ట్.. ఎఫ్‌బీఐ అదుపులో హిమాన్షు భావు, నీరజ్ ఫరీద్‌పురియా!

భారతదేశంలో పలు మోస్ట్ వాంటెడ్ కేసుల్లో నిందితులుగా ఉన్న ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు అమెరికాలో అరెస్టయ్యారు. అమెరికాలోని నెవాడా రాష్ట్రం, లాస్ వెగాస్ ప్రాంతంలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు హిమాన్షు భావు, నీరజ్ ఫరీద్‌పురియాలను అరెస్ట్ చేశారు. ఇద్దరు గ్యాంగ్‌స్టర్లను త్వరగా భారత్‌కు రప్పించే అంశంపై భారత దర్యాప్తు సంస్థలు అమెరికా అధికారులతో ముమ్మరంగా సంప్రదింపులు జరుపుతున్నాయి.

అమెరికాలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్స్ అరెస్ట్.. ఎఫ్‌బీఐ అదుపులో హిమాన్షు భావు, నీరజ్ ఫరీద్‌పురియా!
Himanshu Bhau, Neeraj Faridpuria
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Oct 24, 2026 | 12:47 PM

Share

భారతదేశంలో పలు మోస్ట్ వాంటెడ్ కేసుల్లో నిందితులుగా ఉన్న ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు అమెరికాలో అరెస్టయ్యారు. అమెరికాలోని నెవాడా రాష్ట్రం, లాస్ వెగాస్ ప్రాంతంలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు హిమాన్షు భావు, నీరజ్ ఫరీద్‌పురియాలను అరెస్ట్ చేశారు. ఇద్దరు గ్యాంగ్‌స్టర్లను త్వరగా భారత్‌కు రప్పించే అంశంపై భారత దర్యాప్తు సంస్థలు అమెరికా అధికారులతో ముమ్మరంగా సంప్రదింపులు జరుపుతున్నాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో పాటు ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ పోలీసుల మోస్ట్ వాంటెడ్ జాబితాలో హిమాన్షు భావు పేరు ప్రధానంగా ఉంది. ఇతడిని అదుపులోకి తీసుకోవడానికి భారత దర్యాప్తు సంస్థలు గత నాలుగు సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే 2023లో ఇంటర్‌పోల్ అధికారులు హిమాన్షుపై రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు.పక్కా సమాచారంతో హిమాన్షు భావు, నీరజ్ ఫరీద్‌పురియాలను అదుపులోకి తీసుకున్నారు

నకిలీ పాస్‌పోర్ట్‌తో పరారీ.. విదేశాల నుంచే నెట్‌వర్క్

హర్యానాలోని రోహతక్ జిల్లా రిటోలి గ్రామానికి చెందిన హిమాన్షు భావుపై ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లో హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, అక్రమ ఆయుధాల రవాణా వంటి 64 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కేవలం 2022 మార్చి నెలలో 24 రోజుల వ్యవధిలోనే ఇతను మూడు హత్యలకు పాల్పడి సంచలనం సృష్టించాడు. అదే ఏడాది నకిలీ పత్రాల ద్వారా పాస్‌పోర్ట్ పొందిన హిమాన్షు విదేశాలకు పారిపోయాడు. మొదట దుబాయ్‌కి, ఆ తర్వాత పోర్చుగల్ తదితర యూరోపియన్ సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నాడు. అక్కడే ఉంటూ ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌లలో వందల మంది అనుచరులతో ఒక భారీ క్రిమినల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. తన ముఠాలోని షూటర్లను ఆదేశించడానికి పూర్తిగా ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ అప్లికేషన్‌లను ఉపయోగించేవాడు. గతేడాది ప్రారంభంలో ఇతను డంకీ రూట్ ద్వారా అమెరికాకు చేరుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.

భయానక వసూళ్లు.. హై-ప్రొఫైల్ దాడులు!

హిమాన్షు ముఠా వ్యాపారవేత్తలను బెదిరించడం, హత్యలు, కాల్పులు, దోపిడీలు, కాంట్రాక్ట్ హత్యలకు పాల్పడుతూ భయానక వాతావరణం సృష్టిస్తోంది. ఢిల్లీలోని నరైనా, తిలక్‌నగర్‌లలోని కార్ షోరూమ్‌లపై కాల్పులు జరపడం,ఢిల్లీ-ఎన్‌సీఆర్ వ్యాప్తంగా బిల్డర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, స్థానిక వ్యాపారుల నుండి కోట్లాది రూపాయల వసూళ్లు, బెదిరింపులకు పాల్పడడం చేస్తుంది. ఢిల్లీలోని బర్గర్ కింగ్ అవుట్లెట్‌లో జరిగిన సంచలన హత్య, ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ నివాసం వెలుపల కాల్పులు జరపడం వంటి పలు హై-ప్రొఫైల్ కేసుల్లో ఈ ముఠా ప్రమేయం ఉంది. మరోవైపు లారెన్స్ బిష్ణోయ్ – గోల్డీ బ్రార్ నెట్‌వర్క్‌తో హిమాన్షు భావు గ్యాంగ్‌కు తీవ్రమైన వైరం కొనసాగుతోంది.

నీరజ్ ఫరీద్‌పురియా అరెస్ట్

హిమాన్షు భావుతో పాటు అరెస్టయిన మరో గ్యాంగ్‌స్టర్ నీరజ్ ఫరీద్‌పురియాది కూడా హర్యానానే. ఇతనిపై కూడా 44 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. హిమాన్షు భావు ముఠాతో కలిసి ఇతను ఉమ్మడిగా పలు నేర కార్యకలాపాలను సాగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అమెరికాలో ఈ ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు చిక్కడంతో భారత పోలీసులకు ఇదొక పెద్ద విజయంగా భావిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us