AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aditi Rao Hydari: తను చూస్తే తట్టుకోలేదని వాష్ రూమ్‏కు వెళ్లి ఏడ్చేదాన్ని.. అదితి రావు కామెంట్స్ వైరల్.. 

అదితి.. సిద్ధార్థ్ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తమపై వస్తున్న వార్తలపై ఇప్పటివరకు వీరిద్దరు స్పందించలేదు. కానీ ఇటీవల అదితి పుట్టినరోజు సందర్భంగా సిద్ధార్థ్ ఆమెతో ఉన్న ఫోటో షేర్ చేస్తూ.

Aditi Rao Hydari: తను చూస్తే తట్టుకోలేదని వాష్ రూమ్‏కు వెళ్లి ఏడ్చేదాన్ని.. అదితి రావు కామెంట్స్ వైరల్.. 
Aditi Rao Hydari
Rajitha Chanti
|

Updated on: Oct 31, 2022 | 10:32 AM

Share

అదిథి రావ్ హైదరీ..తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. సమ్మోహనం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయం ఎంత ఉన్నా ఈ ముద్దుగుమ్మకు మాత్రం అంతగా అవకాశాలు రావడం లేదు. అదితి చివరిసారిగా శర్వానంద్, సిద్ధార్థ్ నటించిన మహా సముద్రం చిత్రంలో కనిపించింది. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ ఇండస్ట్రీలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. అయితే కొద్దిరోజులుగా అదితి.. సిద్ధార్థ్ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తమపై వస్తున్న వార్తలపై ఇప్పటివరకు వీరిద్దరు స్పందించలేదు. కానీ ఇటీవల అదితి పుట్టినరోజు సందర్భంగా సిద్ధార్థ్ ఆమెతో ఉన్న ఫోటో షేర్ చేస్తూ.. నా హృదయ రాకుమారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. దీంతో వీరిద్దరి నిజంగానే ప్రేమలో ఉన్నారంటూ మరోసారి ఫిల్మ్ సర్కిల్లో న్యూస్ హల్చల్ చేస్తుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.

తాను సినిమాల్లోకి రావడానికి ముందు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని అన్నారు అదితి. ఆమె మాట్లాడుతూ.. ముందు నేను భారతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించాను. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అనేక ప్రదర్శనలు చేశాను. దీంతో నా ప్రదర్శనలు చూసిన కోలీవుడ్ డైరక్టర్ శారద మొట్ట మొదటి సారి నాకు సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. అయితే సినిమా విడుదల చాలా ఆలస్యమైంది. దీంతో చాలా బాధపడేదాన్ని..

ఇవి కూడా చదవండి

ఫస్ట్ మూవీ విడుదలకు అడ్డంకులు ఎదురుకావడంతో ఎంతో ఫీలయ్యేదాన్ని. మా అమ్మ ముందు నేను ఏడిస్తే తాను తట్టుకోలేదని వాష్ రూమ్ వెళ్లి ఏడ్చేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. అదితి తన మొదటి చిత్రంలో ఆలయ నర్తకి దేవదాసిగా నటించింది. కానీ థియేటర్లలో ముందుగా ప్రజాపతి సినిమా విడుదలైంది. మలయాళ స్టార్ మమ్ముట్టితో స్క్రీన్ షేర్ చేసుకుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.