AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishwak Sen: 1000 స్క్రీన్లలో రీరిలీజ్.. దేశమంతా చర్చించుకుంటుంది.. విశ్వక్ సేన్ కామెంట్స్..

20 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి ఆడియన్స్ ముందుకు రానుండడంతో బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై.. అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఈ సినిమా రీ రిలీజ్ గురించి దేశమంతా చర్చించుకుంటుందన్నారు హీరో విశ్వక్ సేన్.

Vishwak Sen: 1000 స్క్రీన్లలో రీరిలీజ్.. దేశమంతా చర్చించుకుంటుంది.. విశ్వక్ సేన్ కామెంట్స్..
Vishwak Sen
Rajitha Chanti
|

Updated on: May 18, 2023 | 1:00 PM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా బ్లాక్ బస్టర్ హిట్ సింహాద్రి రీరిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈనెల 20న దాదాపు 1000 స్క్రీన్లలో ఈ సినిమాను ప్రదర్శించబోతున్నారు. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసింది. ఇందులో భూమిక, అంకిత కథానాయికలుగా కనిపించిన సంగతి తెలిసిందే. 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి ఆడియన్స్ ముందుకు రానుండడంతో బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై.. అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఈ సినిమా రీ రిలీజ్ గురించి దేశమంతా చర్చించుకుంటుందన్నారు హీరో విశ్వక్ సేన్. ఈ వేడుకలో విశ్వక్‌తోపాటు దర్శకులు హను రాఘవపూడి, గోపీచంద్‌ మలినేని, నిర్మాత నవీన్‌ యెర్నేని పాల్గొన్నారు.

ఈ క్రమంలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. “దేశమంతా ఈ సినిమా రీరిలీజ్ గురించి చర్చించుకుంటుంది. ఇది నేషనల్ న్యూస్ అవుతుంది. ఎన్టీఆర్ అభిమానిగా గర్వపడుతున్నాను.. నాకు తెలిసినంతవరుక ఏ అభిమానికి ఇలాంటి అవకాశం వచ్చి ఉండదు. లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఆస్కార్ వేడుకల అనంతరం మరో రెండు రోజులు ఉండమని అక్కడి వారు అడిగితే.. హైదరాబాద్ లో ఓ ఈవెంట్ కు వెళ్లాలని చెప్పారట. ఈ విషయం నాకు ఒకరు చెబితే తెలిసింది. ఆ స్థాయికి చేరుకున్న ఆయన ఫ్యాన్ కు ఇచ్చిన మాట తప్పకూడదని నా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చాడు. ఆ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. సినిమాల రీరిలీజ్ కల్చర్ మన తెలుగు సినీపరిశ్రమలోనే మొదలైంది. వాటికి ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించే స్థాయికి చేరుకున్నాం” అంటూ చెప్పుకొచ్చారు విశ్వక్. అనంతరం ఈ సినిమాలోని నువ్వు విజిలేస్తే పాటకు మాస్ స్టెప్పులేసి అభిమానుల్లో ఆనందం నింపారు.

ఇవి కూడా చదవండి

విశ్వక్ సేన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. గతంలో తారక్ బర్త్ డేకి స్పెషల్ సాంగ్ చేశాడంటే విశ్వక్ కు ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమనేది అర్థం చేసుకోవచ్చు. తన ఫేవరేట్ హీరో కోసం విశ్వక్ చాలా చేశాడు.. ఇక అందుకు తారక్ సైతం విశ్వక్ కు అండగా నిలబడ్డాడు. విశ్వక్ స్వియ దర్శకత్వంలో వచ్చిన దాస్ కా ధమ్కీ సినిమా చేశాడు. ఈ మూవీ ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా తారక్ విచ్చేసి.. విశ్వక్ సేన్ తన బాధ్యత అంటూ చెప్పారు తారక్. దీంతో విశ్వక్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు.

ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో