AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Vishal: ఇళయరాజాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మిస్కిన్‌పై విశాల్ ఫైర్.. క్షమాపణ సరిపోతుందా?

ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గురించి కోలీవుడ్ డైరెక్టర్ మిస్కిన్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపాయి. సినీ ప్రముఖులు, నెటిజన్స్ మిస్కిన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కోలీవుడ్ హీరో విశాల్ సైతం మిస్కిన్ కామెంట్స్ పై మండిపడ్డారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియో షేర్ చేశారు.

Actor Vishal: ఇళయరాజాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మిస్కిన్‌పై విశాల్ ఫైర్.. క్షమాపణ సరిపోతుందా?
Vishal, Ilayaraja
Rajitha Chanti
|

Updated on: Jan 27, 2025 | 3:46 PM

Share

తమిళ్ డైరెక్టర్ మిస్కిన్ ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బాటిల్ రాధ సినిమా కోసం జరిగిన ఓ కార్యక్రమంలో లెజెండర్ కంపోజర్ సంగీతాన్ని విని చాలా మంది మద్యానికి బానిసలయ్యారని అన్నారు. ఆ తర్వాత తన మాటల పట్ల చింతిస్తున్నానంటూ క్షమాపణలు చెప్పారు. దీంతో మిస్కిన్ వ్యాఖ్యలపై హీరో విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడి ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం కొందరికి ఇష్టంగా మారిందంటూ మండిపడ్డారు. ఎంతోమంది సంగీతప్రియులు ఆరాధించే ఇళయరాజా గురించి అలాంటి కామెంట్స్ చేయడం ఏమాత్రం సరికాదని హితవు పలికారు. ఇందుకు సంబంధించి విశాల్ ఓ వీడియో కూడా షేర్ చేశారు.

“ఇష్టానుసారంగా మాటాలు అనేసి ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం ఆయనకు పరిపాటిగా మారింది. మన మనసుకు అనిపించిన విషయాన్ని మాట్లాడే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కాకపోతే నలుగురిలో ఉన్నప్పుడు, స్టేజ్ పై మాట్లాడేటప్పుడు ఒక పద్దతి ఉంటుంది. ఇళయరాజాను చాలా మంది ఆరాధిస్తుంటారు. అలాంటి వ్యక్తిని అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని నేను ఏమాత్రం క్షమించను. ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసి ఆ తర్వాత రోజు క్షమాపణలు చెబితే మీరు అంగీకరిస్తారా ?” అంటూ ప్రశ్నించారు విశాల్. ఆ తర్వాత నడిగర్ సంఘం తరుపున పద్మ అవార్డులకు ఎంపికైన నటుడు అజిత్, నటి శోభనకు అభినందనలు తెలిపారు. పద్మ పురస్కారాలను అందుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు.

విశాల్, డైరెక్టర్ మిస్కిన్ కాంబోలో 2017లో తుప్పరివాలన్‌ సినిమా వచ్చింది. . యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం విజయం సాధించింది. అయితే, అభిప్రాయ భేదాల కారణంగా ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు సమాచారం. ఈ చిత్రంలో వినయ్ రాయ్, ప్రసన్న కూడా ప్రముఖ పాత్రల్లో నటించారు.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..

రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి