Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Venkatesh: సైలెంట్‏గా వెంకటేశ్ కూతురి నిశ్చితార్థం.. చిరంజీవి, మహేష్ బాబు హాజరు.. ఫోటోస్ వైరల్..

వెంకటేశ్, నీరజ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. వీరిలో పెద్ద అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి జరిగింది. ఓవైపు బిజినెస్ వ్యవహరాలు చూసుకుంటూనే మరోవైపు సొంతంగా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తోంది. ఇక ఇప్పుడు రెండో అమ్మాయికి పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు వెంకీ. బుధవారం తన కూతురు నిశ్చితార్థ వేడుకను హైదరాబాద్‏లో చాలా సైలెంట్‏గా చేశారు. ఇరు కుటుంబసభ్యులు.. ఇండస్ట్రీకి చెందిన అతికొద్ది మంది ప్రముఖుల సమక్షంలో ఎంగెజ్మెంట్ జరిగినట్లు తెలుస్తోంది.

Actor Venkatesh: సైలెంట్‏గా వెంకటేశ్ కూతురి నిశ్చితార్థం.. చిరంజీవి, మహేష్ బాబు హాజరు.. ఫోటోస్ వైరల్..
Venkatesh Daughter Engageme
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 26, 2023 | 10:51 AM

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన రెండో కూతురు హయవాహిని నిశ్చితార్థం వేడుక బుధవారం ఘనంగా జరిగింది. వెంకటేశ్, నీరజ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. వీరిలో పెద్ద అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి జరిగింది. ఓవైపు బిజినెస్ వ్యవహరాలు చూసుకుంటూనే మరోవైపు సొంతంగా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తోంది. ఇక ఇప్పుడు రెండో అమ్మాయికి పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు వెంకీ. బుధవారం తన కూతురు నిశ్చితార్థ వేడుకను హైదరాబాద్‏లో చాలా సైలెంట్‏గా చేశారు. ఇరు కుటుంబసభ్యులు.. ఇండస్ట్రీకి చెందిన అతికొద్ది మంది ప్రముఖుల సమక్షంలో ఎంగెజ్మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిశ్చితార్థంకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

నెట్టింట చక్కర్లు కొడుతున్న ఫోటోస్ చూస్తుంటే.. వెంకీ కూతురి నిశ్చితార్థ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బబు హాజరయ్యి నూతన జంటను ఆశీర్వదించినట్లు తెలుస్తోంది. వెంకటేశ్ రెండో కూతురిని విజయవాడకు చెందిన ఒక డాక్టర్ ఫ్యామిలీలోని అబ్బాయి అని సమాచారం. వచ్చే ఏడాది మార్చిలో హయవాహిని వివాహం జరిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే మొదటి నుంచి వెంకీ సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. ఇక తన సినిమాలు తప్ప.. ఫ్యామిలీ విషయాలు బయటకు తెలియనివ్వకుండా జాగ్రత్తగా ఉంటారు. ఇక ఇప్పుడు తన కూతురి ఎంగజ్మెంట్ విషయం గురించి మీడియాకు తెలియకుండానే చూసుకున్నారు. అటు వెంకీ తనయులు కూడా సోషల్ మీడియాకు దూరంగానే ఉంటారు.

ఇక వెంకీ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సైంధవ్ సినిమా చేస్తున్నాడు. తన కెరీర్ లో 75వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా కీలకపాత్రలలో నటిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.