AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wayanad Landslide: వయనాడ్ విలయాన్ని చూసి చలించిపోయిన స్టార్ హీరో.. బాధితులకు భారీగా ఆర్థిక సాయంతో పాటు..

ప్రకృతి వర ప్రసాదంగా భావించే కేరళలో ఈ విషాదం చోటు చేసుకోవడం అందరినీ కలచి వేస్తోంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువరు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులతో పాటు వివిధ రంగాల సెలబ్రిటీలు వయనాడ్ విషాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వయనాడ్ బాధితులకు తమ వంతు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు

Wayanad Landslide: వయనాడ్ విలయాన్ని చూసి చలించిపోయిన స్టార్ హీరో.. బాధితులకు భారీగా ఆర్థిక సాయంతో పాటు..
Wayanad Landslide
Basha Shek
|

Updated on: Aug 03, 2024 | 8:23 PM

Share

ప్రకృతి ప్రకోపించడంతో కేరళలోని వయనాడ్ విలవిల్లాడిపోయింది. భారీ వర్షాలు, వరదలకు కొండ చరియలు విరిగిపడడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటనలో ఎంతో మంది ఆచూకీ తెలియడం లేదంటున్నారు అధికారులు. ప్రకృతి వర ప్రసాదంగా భావించే కేరళలో ఈ విషాదం చోటు చేసుకోవడం అందరినీ కలచి వేస్తోంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువరు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులతో పాటు వివిధ రంగాల సెలబ్రిటీలు వయనాడ్ విషాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వయనాడ్ బాధితులకు తమ వంతు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలు ఈ విషయంలో చాలా ముందున్నారు. మాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు తమ వంతు సహాయం అందజేస్తున్నారు. విక్రమ్ , సూర్య, నయనతార, విఘ్నేశ్ శివన్, కమల్ హాసన్, మోహన్ లాల్ .. తదితర సినీ ప్రముఖులు వయనాడ్ బాధితులకు విరాళం అందజేశారు. తాజాగా మ‌ల‌యాళ స్టార్ హీరో టోవినో థామ‌స్ తన వంతు సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చాడు.

ఇవి కూడా చదవండి

వయనాడ్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశాడు టోవినో థామస్. ఈ దుర్ఘటన నుంచి కేరళ ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. అలాగే వ‌య‌నాడ్ ప్ర‌జ‌ల కోసం రూ.25ల‌క్ష‌లు సాయం ప్ర‌క‌టించాడు. దాంతో పాటుగా వెయ్యి స్టీల్ ప్లేట్ల‌ను కూడా అందించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. కేర‌ళ సీఎం రిలీఫ్ ఫండ్ కి ఆ డ‌బ్బులు ఇవ్వ‌నున్నట్లు చెబుతూ ఒక వీడియోను రిలీజ్ చేశారు టోవినో థామస్.

వీడియో ఇదిగో..

అంతకు ముందు మరో మలయాళ స్టార్ హీరో మోహ్ న్ లాల్ స్వయంగా వెళ్లి వయనాడ్ లో పర్యటించారు. ఆర్మీ డ్రెస్ లో వరదల వల్ల ప్రభావితమైన ప్రాంతాలను పరిశీలించారు. ఆ తర్వాత వయనాడ్ ప్రజల సహాయార్థం రూ. 3 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.