Tollywood: ఇప్పటివరకు డిష్యూం డిష్యూం.. ఇప్పుడు కాస్త రొమాంటిక్‌గా చెర్రీ, తారక్!

Tollywood: ఇప్పటివరకు డిష్యూం డిష్యూం.. ఇప్పుడు కాస్త రొమాంటిక్‌గా చెర్రీ, తారక్!

Anil kumar poka

|

Updated on: Aug 05, 2024 | 10:43 AM

ఎప్పుడూ డిస్స్యూమ్ డిస్స్యూమ్ ఏంటి గురు.. ఆ రోప్స్ కట్టుకొని ఫైట్ మాస్టర్స్ తో ఇన్నాళ్ళుగా ఉన్న యాక్షన్ సీక్వెన్స్ ఇప్పుడు కాస్త రొమాంటిక్ గా ప్లాన్ చేయొచ్చుగా అని ఇన్నాళ్లు కోరుకున్న ఫ్యాన్స్ మాటలను ఆలకించినట్టు ఉన్నారు మేకర్స్. అప్ కమింగ్ సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ చూసుకోడానికి రెడీ అయిపోండి అంటూ హింట్ ఇచ్చేసారు చెర్రీ టూ తారక్.! అందరూ దీనికి రెడీ అవుతున్నట్టే గా..

ఎప్పుడూ డిష్యూం డిష్యూం ఏంటి గురు.. ఆ రోప్స్ కట్టుకొని ఫైట్ మాస్టర్స్ తో ఇన్నాళ్ళుగా ఉన్న యాక్షన్ సీక్వెన్స్ ఇప్పుడు కాస్త రొమాంటిక్ గా ప్లాన్ చేయొచ్చుగా అని ఇన్నాళ్లు కోరుకున్న ఫ్యాన్స్ మాటలను ఆలకించినట్టు ఉన్నారు మేకర్స్. అప్ కమింగ్ సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ చూసుకోడానికి రెడీ అయిపోండి అంటూ హింట్ ఇచ్చేసారు చెర్రీ టూ తారక్.! అందరూ దీనికి రెడీ అవుతున్నట్టే గా.. హరీష్‌ శంకర్‌ టేకింగ్‌ మీద మంచి గురి ఉంటుంది అభిమానులకు. లేటెస్ట్ గా మిస్టర్‌ బచ్చన్‌ సాంగ్స్ లో ఆ విషయాన్ని ప్రూవ్‌ చేసుకుంటున్నారు మిస్టర్‌ హరీష్‌. చాన్నాళ్ల తర్వాత రవితేజ కెరీర్లోనూ మంచి పాట పడిందని హ్యాపీగా ఉన్నారు మాస్‌ మహరాజ్‌ ఫ్యాన్స్.జరగండి.. జరగండి అంటూ దుమ్మురేపుతున్న గేమ్‌ చేంజర్‌ జంట ఈ సారి మాత్రం మంచి రొమాంటిక్‌ సాంగ్‌తో పలకరించడానికి రెడీ అవుతోందన్నది న్యూస్‌.

ఆల్రెడీ వినయవిధేయరామలో చెర్రీ, కియారా కెమిస్ట్రీని విట్‌నెస్‌ చేసిన ప్రేక్షకులు అప్‌కమింగ్‌ సాంగ్‌ కోసం వెయిటింగ్‌ అంటున్నారు. తారక్‌తో స్టెప్పులేయడానికి జాన్వీ కపూర్‌ ఎంతగా ఎదురుచూస్తున్నారో ఏమోగానీ, వారిద్దరినీ కలిపి స్క్రీన్‌ మీద చూడటానికి మాత్రం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు. మీ రిక్వెస్టులు అందాయి.. మీకోసమే ఈ స్పెషల్‌ ట్రీట్‌ అంటూ రొమాంటిక్‌ సాంగ్‌ గురించి అనౌన్స్ చేసింది టీమ్‌. ఇన్‌స్టంట్‌గా చార్ట్ బస్టర్‌ చేసేయాలని… ఆ క్షణాల కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఆగస్టు, సెప్టెంబర్‌లో వచ్చే మీరే ఇన్ని ప్లాన్‌లు వేసుకుంటుంటే, డిసెంబర్‌లో పలకరించాలనుకుంటున్న మా పుష్పరాజ్‌ తగ్గుతాడా ఏంటి? అని దర్జాగా ఉన్నారు అల్లు సైన్యం. పుష్పరాజ్‌ – శ్రీవల్లి మధ్య సుకుమాస్టర్‌ ఏమైనా రొమాంటిక్‌ సాంగ్‌ ప్లాన్‌ చేశారేమోనని సైలెంట్‌గా ఆరా తీస్తున్నారు…

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Aug 04, 2024 08:08 AM