AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Suriya : ఎంత మంచి మనసు సర్ మీది.. పిల్లల చదువు కోసం కోట్లు దానం చేసిన సూర్య..

తమిళ్ హీరో సూర్య ఇటీవలే రెట్రో సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పటివరకు దాదాపు రూ.104 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా మరోసారి తన మనసు చాటుకున్నారు సూర్య. ఇంతకీ ఏం చేశారో తెలుసా.. ?

Actor Suriya : ఎంత మంచి మనసు సర్ మీది.. పిల్లల చదువు కోసం కోట్లు దానం చేసిన సూర్య..
Suriya
Rajitha Chanti
|

Updated on: May 08, 2025 | 7:26 AM

Share

కోలీవుడ్ ఇండస్ట్రీలోని అత్యంత డిమాండ్ ఉన్న హీరోలలో సూర్య ఒకరు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే రెట్రో మూవీతో అడియన్స్ ముందుకు వచ్చాడు. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ఈ చిత్రాన్ని సూర్య నిర్మాణ సంస్థ, కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాణ సంస్థ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే రూ.108 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా సూర్య మరోసారి మంచి మనసు చాటుకున్నాడు. ఇప్పుడు తన రెట్రో సినిమాకు వచ్చిన లాభాల నుంచి కొంత మొత్తాన్ని పేద విద్యార్థుల చదువుకు దానం చేశారు.

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రెట్రో సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే తన అగరం ఫౌండేషన్‏కు రెట్రో సినిమా కలెక్షన్స్ నుంచి రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు నిర్వాహకులకు స్వయంగా చెక్ అందించారు సూర్య. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. సూర్య మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. అగరం ఫౌండేషన్‏ను 2006లో సూర్యనే స్థాపించారు. ఈ ఫౌండేషన్ ద్వారా పేద, అనాథ పిల్లలకు చదివిస్తూ వారికి కావాల్సిన సౌకర్యాలు అందిస్తుంది. ఇప్పటికే ఈ ఫౌండేషన్ ద్వారా చదువుకుని చాలామంది ప్రయోజకులు అయ్యారు.

నిజానికి సూర్య రీల్ హీరో మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా. ఇప్పటికే సామాజిక సేవలో ముందుంటారు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం నిజ జీవితంలోనూ చేయాలని సూర్య అంటుంటారు. ప్రస్తుతం హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్నారు సూర్య. ఇటీవలే రెట్రో మూవీతో అడియన్స్ ముందుకు వచ్చారు.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే