AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suman: దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు లోకలే… తెలుగు నటులంతా కలిసి ఉండాలి : సుమన్

మా ఎన్నికలు హడావిడి రసవత్తరంగా మారాయి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో నటులు ఒకరి పై మరొకరు విమర్శలు చేసుకుంటూ వేడి పుట్టిస్తున్నారు.

Suman: దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు లోకలే... తెలుగు నటులంతా కలిసి ఉండాలి : సుమన్
Suman
Rajeev Rayala
|

Updated on: Jul 02, 2021 | 10:58 AM

Share

Suman: మా ఎన్నికలు హడావిడి రసవత్తరంగా మారాయి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో నటులు ఒకరి పై మరొకరు విమర్శలు చేసుకుంటూ వేడి పుట్టిస్తున్నారు. అయితే లోకల్ నాన్ లోకల్ అనే అంశం పెద్ద దుమారం రేపుతోంది. ప్రకాశ్ రాజ్ ను నాన్ లోకల్ అంటూ కొందరు ఆరోపించడం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. దీని పై ఇప్పటికే పలువురు సినిమా తారలు స్పందించారు. తాజాగా సీనియర్ నటుడు సుమన్ స్పందించారు. ఈమేరకు ఆయన ఓ సెల్ఫీ వీడియో ను షేర్ చేశారు. ఆ వీడియోలో సుమన్ మాట్లాడుతూ.. దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు లోకలేనని అన్నారు. స్థానికత పేరుతో విమర్శించడం భావ్యం కాదన్నారు. తెలుగు నటీనటుల సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తున్న విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కు సుమన్ పరోక్షంగా మద్దతు ప్రకటించారు.

వైద్యులు నాన్ లోకల్ అనుకుంటే ప్రజలకు చికిత్స అందదని వ్యాఖ్యానించారు. దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు లోకలేనని పేర్కొన్న సుమన్… తెలుగు సినీ నటినటులంతా కలిసి ఉండాలని విజ్ఞప్తి చేశారు. అనుభవానికి, సీనియారిటీకి మద్దతు ఇవ్వండి, లోకల్ నాన్ లోకల్ అనేది ఇతర రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులకు, వ్యాపారులకు ఇబ్బందికరం అన్నారు నటుడు సుమన్.

మరిన్ని ఇక్కడ చదవండి :

Pooja Hegde : దళపతి ‘బీస్ట్’ కోసం చెన్నైకు చెక్కేసిన బుట్టబొమ్మ.. ఎయిర్ పోర్ట్ లో పూజా సందడి

Gayatri Rao: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటి.. ఇప్పుడెలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు..

Shyam Singha Roy: షూటింగ్ షురూ చేసిన శ్యామ్ సింగరాయ్.. బ్యాక్ ఇన్ యాక్షన్ అంటూ పోస్టర్