AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Suhas: తొలిసారి అలాంటి సీన్స్‏లో నటించా.. హీరో సుహాస్ కామెంట్స్..

ఇటీవలే రైటర్ పద్మభూషణ్ సినిమాతో హిట్ అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమాతో మరో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. త్వరలోనే ప్రసన్న వదనం సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు సుహాస్.

Actor Suhas: తొలిసారి అలాంటి సీన్స్‏లో నటించా.. హీరో సుహాస్ కామెంట్స్..
Suhas
Rajitha Chanti
|

Updated on: Mar 08, 2024 | 8:41 AM

Share

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు హీరోగా దూసుకుపోతున్నాడు సుహాస్. షార్ట్ ఫిలిమ్స్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి.. ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. కలర్ ఫోటో సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. లాక్ డౌన్ కారణంగా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీంతో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో సక్సెస్ ఫుల్ హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే రైటర్ పద్మభూషణ్ సినిమాతో హిట్ అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమాతో మరో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. త్వరలోనే ప్రసన్న వదనం సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు సుహాస్.

ప్రసన్న వదనం టీజర్ లాంచ్ ఈవెంట్లో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు సుహాస్. తాను ఇప్పటివరకు చేయనిది ప్రసన్న వదనంలో ప్రయత్నించానని.. దాని గురించి మాట్లాడానికి కూడూ సిగ్గుపడుతున్నానని అన్నారు. ఈ చిత్రంలో తొలిసారి లిప్ లాక్ సీక్వెన్స్ లో నటించానని అన్నారు. సుహాస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అలాగే రెమ్యునరేషన్ విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు సుహాస్. పారితోషికం పెంచారని వార్తలు వస్తున్నాయి. నిజమేనా అని అడగ్గా.. సుహాస్ మాట్లాడుతూ.. నేను బతకొద్దా ?.. జూనియర్ ఆర్టిస్ట్ గా రోజుకు రూ. 100 తీసుకుని ఇప్పుడు హీరోగా కష్టపడి ఎదిగానని.. రెమ్యునరేషన్ పెంచానని..కానీ మీరు అనుకున్నంత కాదని అన్నారు.

సుహాస్ నటిస్తోన్న ప్రసన్న వదనం సినిమాలో పాయల్ రాధకృష్ణ, రాశి సింగ్, నందు, వైవా హర్ష, నితిన్ ప్రసన్న కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అర్జున్ వై.కే దర్శకత్వం వహించగా.. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. నిన్న విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని త్వరలోనే అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్