AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ooru Peru Bhairavakona: ఓటీటీలోకి వచ్చేసిన ‘ఊరు పేరు భైరవకోన’.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే..

ఈరోజు థియేటర్లలో గామి, భీమా సినిమాలు విడుదలయ్యాయి. అలాగే మలయాళీ సూపర్ హిట్ మూవీ ప్రేమలు తెలుగులో డబ్బింగ్ అయ్యింది. ఈ మూడు చిత్రాలకు ఉదయం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇటు థియేటర్లలో గామి, భీమ, ప్రేమలు చిత్రాలు అలరిస్తుండగా.. అటు ఓటీటీలోనూ సూపర్ హిట్ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్, కామెడీ ఎంటర్టైన్మెంట్స్, హారర్ మూవీస్ ఇప్పుడు ఓటీటీ సినీ ప్రియులకు అందుబాటులోకి వచ్చేశాయి.

Ooru Peru Bhairavakona: ఓటీటీలోకి వచ్చేసిన 'ఊరు పేరు భైరవకోన'.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే..
Ooru Peru Bhairavakona Movie
Rajitha Chanti
|

Updated on: Mar 08, 2024 | 8:16 AM

Share

తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలు శివనామస్పరణతో మారుమోగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామునే భక్తులు శివాలయాలకు పోటెత్తారు. రెండు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ తమను చల్లగా చూడమని వేడుకుంటున్నారు భక్తులు. మరోవైపు సినీ పరిశ్రమలో ఈ శుక్రవారం వరుస సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈరోజు థియేటర్లలో గామి, భీమా సినిమాలు విడుదలయ్యాయి. అలాగే మలయాళీ సూపర్ హిట్ మూవీ ప్రేమలు తెలుగులో డబ్బింగ్ అయ్యింది. ఈ మూడు చిత్రాలకు ఉదయం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇటు థియేటర్లలో గామి, భీమ, ప్రేమలు చిత్రాలు అలరిస్తుండగా.. అటు ఓటీటీలోనూ సూపర్ హిట్ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్, కామెడీ ఎంటర్టైన్మెంట్స్, హారర్ మూవీస్ ఇప్పుడు ఓటీటీ సినీ ప్రియులకు అందుబాటులోకి వచ్చేశాయి. అందులో ఊరు పేరు భైరవకోన ఒకటి. యంగ్ సందీప్ కిషన్ నటించిన ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ వి.ఐ ఆనంద్ దర్శకత్వం వహించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఊరు పేరు భైవరకోన. ఇందులో వర్ష బొల్లమ్మ, కావ్య తాపర్ హీరోయిన్లుగా నటించారు. గత నెలలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంది. చాలా కాలం తర్వాత సందీప్ ఖాతాలో సూపర్ హిట్ పడింది. ఇక థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా.. మార్చి 8 నుంచి అందుబాటులోకి వచ్చేసింది. ఇన్నాళ్లు థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు నేరుగా ఓటీటీలో చూడొచ్చు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించగా.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించారు.

ఊరు పేరు భైరవకోన కథ.. భైరవకోన అనే గ్రామం చాలా విచిత్రం. ఈ ఊర్లోకి అడుగుపెట్టిన వాళ్లు మళ్లీ ప్రాణాలతో తిరిగి వచ్చిన దాఖాలాలు లేవు. అలాంటి గ్రామంలోకి సందీప్ తన స్నేహితులతో కలిసి అడుగుపెడతారు. ఓ దొంగతనం చేసి పోలీసులకు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఈ ఊర్లోకి చేరతాడు సందీప్. అక్కడ వారు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటీ ?.. అసలు భైరవకోన గ్రామంలో ఏం జరుగుతుంది ? గరుడ పురాణంలో మిస్ అయిన నాలుగు పేజీలతో భైవరకోన గ్రామానికి ఉన్న సంబంధం ఏంటీ ? సందీప్ కిషన్ తన స్నేహితులతో కలిసి ఎలా బయటపడ్డాడు ? అనేది ఊరు పేరు భైరవకోన కథ. ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.