Hanuman OTT : ఇదేంది భయ్యా.. ఓటీటీ ప్రియులకు మళ్లీ నిరాశే.. హనుమాన్ ఎక్కడా అంటూ నెటిజన్స్ అసహనం.

ఇప్పటికే సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. కానీ హనుమాన్ మూవీ మాత్రం ఇంకా ఓటీటీలో అందుబాటులోకి రాలేదు. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది... వెంకటేశ్ సైందవ్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో.. నాగార్జున్ సామిరంగ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. ఇక హనుమాన్ మాత్రం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వేట కొనసాగిస్తుంది.

Hanuman OTT : ఇదేంది భయ్యా.. ఓటీటీ ప్రియులకు మళ్లీ నిరాశే.. హనుమాన్ ఎక్కడా అంటూ నెటిజన్స్ అసహనం.
Hanuman Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 08, 2024 | 7:47 AM

సంక్రాంతికి విడుదలైన అన్ని చిత్రాల్లో రికార్డ్ బ్రేక్ వసూళ్లు రాబట్టిన సినిమా హనుమాన్. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీపై విమర్శకులు, స్టార్ సెలబ్రెటీస్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాకు నార్త్ అడియన్స్ ఫిదా అయ్యారు. తేజ సజ్జా యాక్టింగ్.. ప్రశాంత్ వర్మ మేకింగ్, వీఎఫ్ఎక్స్ విజువల్స్ సినిమాకు హైలెట్ అయ్యాయి.. జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపు 50 రోజులకు పైగా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. ఇప్పటికే సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. కానీ హనుమాన్ మూవీ మాత్రం ఇంకా ఓటీటీలో అందుబాటులోకి రాలేదు. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది… వెంకటేశ్ సైందవ్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో.. నాగార్జున్ సామిరంగ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. ఇక హనుమాన్ మాత్రం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వేట కొనసాగిస్తుంది. ఈసినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వస్తుందా ? అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలోనే హనుమాన్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై తెగ ప్రచారం జరిగింది. ఇదిగో రిలీజ్.. అదిగో స్ట్రీమింగ్ అంటూ నెట్టింట అనేక రూమర్స్ వైరలయ్యాయి. మొత్తానికి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందని ప్రచారం నడిచింది. దీంతో ఈ సినిమాను చూసేందుకు వేయి కళ్లతో వెయిట్ చేశారు అడియన్స్. కానీ ఓటీటీ ప్రియులకు మరోసారి నిరాశే ఎదురయ్యింది. నెట్టింట జరిగిన ప్రచారం ప్రకారం ఈరోజు జీ5లో హనుమాన్ మూవీ రిలీజ్ కాలేదు. దీంతో సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. హనుమాన్ ఓటీటీ అన్నారు ఎక్కడ ? అంటూ ఓ నెటిజన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మను ట్యాగ్ చేశాడు. ప్రశాంత్ వర్మ మీరు ముందు హనుమాన్ ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్తే కొంచెం మా ఫ్యామిలీ కలిసి చూస్తాము అంటూ చిత్రయూనిట్ కు ట్యాగ్ చేశాడు మరో నెటిజన్. హనుమాన్ స్ట్రీమింగ్ డేట్ ఏంటీ ?.. కొంచెం అప్డేట్ ఇవ్వండి అంటూ ట్విట్టర్ లో నానా హంగామా చేస్తున్నారు నెటిజన్స్. ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై క్లారిటీ మాత్రం రావడం లేదు.

అయితే హనుమాన్ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పండి అంటూ ఓ నెటిజన్ ట్టీట్టర్ వేదికగా మొర పెట్టుకున్నాడు. ఇందుకు జీ5ని ట్యాగ్ చేశాడు. హనుమాన్ రిలీజ్ విషయంలో ఇంతవరకు మాకు ఎలాంటి అప్డేట్ లేదంటూ రిప్లై ఇచ్చింది జీ5. దీంతో ఈ మూవీ స్ట్రీమింగ్ పై మరోసారి సందేహాలు వ్యక్తమయ్యాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.