Hanuman OTT: మరికొన్ని గంటల్లో స్ట్రీమ్ అవ్వాల్సిన హనుమాన్.. ప్రేక్షకులకు షాకిచ్చిన ఓటీటీ సంస్థ..

కానీ కొన్నిరోజులుగా హనుమాన్ ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక అడియన్స్ నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఈమూవీని మహాశివరాత్రి రోజు (మార్చి 8న) స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 అధికారికంగా ప్రకటించింది. రేపు మహాశివరాత్రి.. అంటే మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రాబోతుంది హనుమాన్ మూవీ.

Hanuman OTT: మరికొన్ని గంటల్లో స్ట్రీమ్ అవ్వాల్సిన హనుమాన్.. ప్రేక్షకులకు షాకిచ్చిన ఓటీటీ సంస్థ..
Hanuman Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 07, 2024 | 6:10 PM

పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా హానుమాన్. సంక్రాంతి పండక్కి థియేటర్లలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ సినిమా. చిన్న సినిమాగా వచ్చి ఎవరూ ఊహించని రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం.. తేజ సజ్జా నటనపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. దాదాపు 50 రోజులుగా థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతుంది ఈ మూవీ. కానీ కొన్నిరోజులుగా హనుమాన్ ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక అడియన్స్ నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఈమూవీని మహాశివరాత్రి రోజు (మార్చి 8న) స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 అధికారికంగా ప్రకటించింది. రేపు మహాశివరాత్రి.. అంటే మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రాబోతుంది హనుమాన్ మూవీ. ఇప్పటికే సోషల్ మీడియాలో హనుమాన్ పేరు ట్రెండ్ అవుతుంది. అయితే ఇప్పుడు ప్రేక్షకులకు ఝలక్ ఇచ్చింది ఓటీటీ సంస్థ జీ5. ఈ సినిమా స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్న ప్రేక్షకులను సందీగ్ధంలోకి నెట్టేసింది.

మరికొన్ని గంటల్లోనే హనుమాన్ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. కానీ ఇప్పటివరకు ఈ మూవీ గురించి సదరు సంస్థ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ఓ నెటిజన్ ట్విట్టర్ వేదికగా హనుమాన్ స్ట్రీమింగ్ అప్డేట్ కావాలని కోరాడు. హనుమాన్ ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుంది ?.. దయచేసి ఈ విషయాన్ని కన్ఫార్మ్ చేయండి అంటూ ట్వీట్ చేస్తూ.. జీ5ని ట్యాగ్ చేశాడు. ఇక ఈ ట్వీట్ కు జీ5 సంస్థ స్పందిస్తూ.. “ఇందుకు సంబంధించి మాకు ఎలాంటి అప్డేట్ రాలేదు. మరింత సమాచారం కోసం మా సోషల్ మీడియా ఖాతాలపై.. వెబ్ సైట్ పై ఓ కన్నేసి ఉంచండి” అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో ఇప్పుడు హనుమాన్ సినిమా స్ట్రీమింగ్ అవుతుందా ?లేదా?.. చివరి క్షణంలో ఇదేం ట్విస్ట్ రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

జీ5 ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు ప్రేక్షకులను గందరగోళంలో పడేసింది. థియేటర్లలో విడుదలై 50 రోజులు గడుస్తున్నా ఓటీటీ స్ట్రీమింగ్ పై స్పష్టత రావడం లేదు. ఇప్పటికే బిగ్ స్క్రీన్ పై చూడనివాళ్లు ఇప్పుడు ఓటీటీలో చూడొచ్చు అని సంబరపడిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ పై మరో సందిగ్దత ఏర్పడింది. మరీ ఈరోజు అర్దరాత్రి ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందా ?లేదా ? అనేది చూడాలి. ఈ మూవీలో తేజా సజ్జా, అమృతా అయ్యార్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలకపాత్రలు పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.