Hanu Man OTT: ఇదేం ట్విస్ట్.. ఓటీటీలో కంటే ముందే టీవీలో ‘హనుమాన్’.. టెలికాస్ట్ ఎప్పుడు, ఎక్కడంటే?
తేజ సజ్జా బ్లాక్ బస్టర్ సినిమా హనుమాన్ డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు మరో షాకింగ్ న్యూస్. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 కూడా తమకెలాంటి సమాచారం లేదని..
తేజ సజ్జా బ్లాక్ బస్టర్ సినిమా హనుమాన్ డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు మరో షాకింగ్ న్యూస్. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 కూడా తమకెలాంటి సమాచారం లేదని చేతులెత్తేసింది. దీంతో శివరాత్రి రోజు హనుమాన్ సినిమాను చూద్దామని ఆశించిన సినీ ప్రియులకు నిరాశే మిగిలింది. ఇదిలా ఉంటే హనుమాన్ హిందీ వెర్షన్ మాత్రం అప్పుడే టీవీ ప్రీమియర్ కు రెడీ అయిపోయింది. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఇదే విషయంపై ట్వీట్ చేశాడు. ‘ మన విశ్వంలో తొలి సూపర్ హీరో ఇప్పుడు టీవీ స్క్రీన్లపై కనిపించనున్నాడు. మార్చి 16 రాత్రి 8 గంటలకు హనుమాన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ హిందీలో తొలిసారి కలర్స్ సినీప్లెక్స్, జియో సినిమాల్లో చూడండి’ అని సదరు ఛానెల్స్ ట్వీట్ చేశాయి. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. మార్చి 16న మూవీ టీవీ టెలికాస్ట్ ఉండటంతో ఆలోపే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందేమోనని సినీ లవర్స్ భావిస్తున్నారు.
సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన హనుమాన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం రూ.40 కోట్లతో తీసిన ఈ సూపర్ హీరో మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.330 కోట్లకి పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది. హనుమాన్ మూవీలో అమృతా అయ్యర్ కథానాయికగా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్ హీరో సోదరి పాత్రలో కన్నీళ్లు పెట్టింది. ఇక వాన ఫేమ్ వినయ్ రాయ్ స్టైలిష్ విలన్ గా మెప్పించాడు. వీరితో పాటు సముద్ర ఖని, వెన్నెల కిశోర్, జబర్దస్త్ శీను, తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి హనుమాన్ సినిమాను నిర్మించారు.
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్..
Brahmaand ka sabse pehla SUPERHERO ab aayega aapke TV screens par! 🔥📺
16 March raat 8 baje, dekhiye #HanuMan ka World Television Premiere, Hindi mein pehli baar, Colors Cineplex aur JioCinema par.@tejasajja123 @Actor_Amritha @Primeshowtweets @RKDStudios @Colors_Cineplex… pic.twitter.com/0Uq7qg6Efh
— Prasanth Varma (@PrasanthVarma) March 8, 2024
My heart is full seeing House full shows for #HanuMan today across the Telugu States 🙏
Grateful to the audience for such overwhelming love from the beginning and Enjoy this Maha Shivratri with your families at the cinemas with HANUMAN ❤️🔥
As per a huge request from everyone we… pic.twitter.com/05T5Z84uNN
— Prasanth Varma (@PrasanthVarma) March 8, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి