Premikudu: మరో సూపర్ హిట్ లవ్ స్టోరీ రీరిలీజ్ .. సరికొత్తగా వస్తోన్న ‘ప్రేమికుడు’.. ఎప్పుడంటే..

ప్రేమికుడు. తమిళంలో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను ఇప్పుడు భారీ ధర ఇచ్చి మరీ కొనుగోలు చేసి రీరిలీజ్ కోసం సిద్ధం చేస్తున్నారు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ప్రభుదేవా,నగ్మా హీరోహీరోయిన్లుగా నటించిన ఈసినిమాలోని సాంగ్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్. 1994లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేసింది ఈ మూవీ. కేవలం మూడు కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 15 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు మరోసారి ఈ సూపర్ హిట్ విడుదల కాబోతుంది.

Premikudu: మరో సూపర్ హిట్ లవ్ స్టోరీ రీరిలీజ్ .. సరికొత్తగా వస్తోన్న 'ప్రేమికుడు'.. ఎప్పుడంటే..
Premikudu
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 08, 2024 | 9:33 AM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగులో అనేక చిత్రాలు మరోసారి అడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. కొన్ని రోజులుగా హీరో సిద్ధార్థ్ సూపర్ హిట్స్ మళ్లీ రిలీజ్ అవుతున్నాయి. ఓయ్, బొమ్మరిల్లు చిత్రాలు రీరిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ హిట్ మూవీని విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. అదే ప్రేమికుడు. తమిళంలో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను ఇప్పుడు భారీ ధర ఇచ్చి మరీ కొనుగోలు చేసి రీరిలీజ్ కోసం సిద్ధం చేస్తున్నారు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ప్రభుదేవా,నగ్మా హీరోహీరోయిన్లుగా నటించిన ఈసినిమాలోని సాంగ్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్. 1994లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేసింది ఈ మూవీ. కేవలం మూడు కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 15 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు మరోసారి ఈ సూపర్ హిట్ విడుదల కాబోతుంది.

దాదాపు 30 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని ఇప్పుడు రీరిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు మేకర్స్. సీఎల్ఎన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మురళీధర్ రెడ్డి, రమణ ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే భారీ ధర చెల్లించి రీరిలీజ్ రైట్స్ సొంతం చేసుకున్నారు. త్వరలోనే ఈమూవీ విడుదల తేదీని ప్రకటించనున్నారు. అప్పట్లోనే రిలీజ్ కోసం పోటీని ఎదుర్కొన్న ఈ మూవీ.. ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

తమిళంలో ఈ చిత్రాన్ని కాదలన్ పేరుతో తెరకెక్కించారు శంకర్. 1994లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఇదే సినిమాను తెలుగులో ప్రేమికుడు పేరుతో డబ్ చేశారు. ఇటు తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకుంది. ఇక రెహమాన్ అందించిన సంగీతం గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఎక్కడ చూసిన ప్రేమికుడు మూవీ సాంగ్స్ వినిపిస్తుంటాయి. ఇందులో ప్రభుదేవా తండ్రిగా దివంగత సింగర్ ఎస్పీ బాలు నటించారు. ప్రభుత్వ కాలేజీలోని ఓ సాధారణ అబ్బాయి.. గవర్నర్ కూతురిని చూసి ప్రేమలో పడతారు. ఆ తర్వాత వీరి ప్రేమకథలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది సినిమా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.